సక్సెస్ ముందు తలొంచిన మహేష్

అవసరం మనది అయినపుడు తలవొంచాల్సిందే. దానవీరశూరకర్ణలో డైలాగు వుంటుంది..'యాచనకు వచ్చినపుడు వేచి వుండక తప్పదు కదా' అని. టాలీవుడ్ లో అవసరాలే బంధాలను ఏర్పరుస్తాయి. మహేష్-త్రివిక్రమ్ మూడో సినిమా అలాంటి వ్యవహారమే. 

హారిక హాసిని సంస్థ మహేష్ తో సినిమాకు ఏనాడో అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ఎందుకో అది మెటీరియలైజ్ కాలేదు. నిజంగా అవసరం పడిందో, లేక వడ్డీ దండగ అనుకున్నారో, మొత్తం మీద మహేష్ ను అడిగి అడ్వాన్స్ వెనక్కు తెచ్చుకున్నారు.

ఓ ఫామ్ లో వున్న హీరో నుంచి పెద్ద ఆర్గనైజేషన్ అడ్వాన్స్ వెనక్కు తీసుకోవడం అదే ఫస్ట్ లేదా అదే లాస్ట్ కావచ్చు. అక్కడితో త్రివిక్రమ్-మహేష్ బంధం తెగిపోయినట్లే అనుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోల వ్యవహారం అలాగే వుంటుంది. ఆ తరువాత ఇక ఆ కాంబినేషన్ నే మరిచిపోయారు.

అలవైకుంఠపురములో సినిమా విడుదలప్పుడు సరిలేరు నీకెవ్వరుతో పోటీ ఇంతా అంతా కాదు. పాటల విడుదల దగ్గర నుంచి సినిమా విడుదల వరకు పోటా పోటీ, కలెక్షన్ల నెంబర్ల విషయంలో హఢావుడి. ఇలా కిందామీదా అయిపోయారు. 

కట్ చేస్తే,అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్. అప్పటి నుంచి మహేష్ భార్య నమ్రత ఎలాగైనా మళ్లీ త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ సెట్ చేయాలనుకున్నారు. ఆమె నే చొరవ తీసుకువ్నారు. కొన్ని యాడ్ల కు త్రివిక్రమ్ పేరు రిఫర్ చేసారు.

మొత్తానికి కాంబినేషన్ సెట్ చేసారు. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏమిటంటే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయింది. త్రివిక్రమ్ మీద ఎన్టీఆర్ కోపంగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

అయినా త్రివిక్రమ్-హారిక ధీమా ఒక్కటే హిట్ కొడితే ఏ హీరో అయినా పిలిచి సినిమా చేతిలో పెడతారు. హిట్ లేకపోతే వేరే సంగతి. అందువల్ల నో ప్రోబ్లమ్ అన్నదే పాయింట్.

Show comments