బాలయ్య రెమ్యూనిరేషన్ 7 కోట్లే

హీరోల రెమ్యూనిరేషన్లు ఆకాశాన్ని అంటేసాయి. టాప్ హీరోలు యాభై కోట్లు, అరవై కోట్లు తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు పది కోట్లకు చేరిపోయారు. కానీ సీనియర్ హీరోల పరిస్థితి చిత్రంగా వుంది. 

మెగాస్టార్ ది ఓ ప్రత్యేకమైన కేటగిరీ, విక్టరీ వెంకటేష్ తన ఎఫ్ 3 సినిమాకు కాస్త గట్టిగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్ వుంది. నాగార్జున రెమ్యూనిరేషన్ మాత్రం స్టడీగానే వుంది. పెరగడం లేదు తరగడం లేదు. అయిదారుకోట్ల రేంజ్ లోనే వున్నారని బోగట్టా. ఇక మిగిలింది బాలయ్యే.

ఇటీవల టీజర్ తో సంచలనాలు నమోదు చేస్తున్న అఖండ సినిమాకు బాలయ్య రెమ్యూనిరేషన్ జస్ట్ ఏడు కోట్లే అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. బాలయ్య పది కోట్లు డిమాండ్ చేసారని, అయితే బోయపాటి నచ్చచెప్పి ఏడుకోట్లకు ఒప్పించారని తెలుస్తోంది. 

సినిమాకు దర్శకుడు బోయపాటి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదని, లాభాల్లో వాటా తీసుకునే విధంగా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డితో ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. 

అఖండ సినిమాకు 70 కోట్లు బడ్జెట్ అవుతుందని మొదటి నుంచీ వినిపిస్తూ వచ్చింది. అందుకే రెమ్యూనిరేషన్ల దగ్గరే కంట్రోలు చేయాలని ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. హీరో, డైరక్టర్ రెమ్యూనిరేషన్లు కీలకం కాబట్టి, ఈ విధంగా సెట్ చేసినట్లు కనిపిస్తోంది.

Show comments