బాలయ్యతో పోటీ పడ్డ బన్నీ?

టాలీవుడ్ హీరోలకు యూ ట్యూబ్ వ్యూస్ నే ప్రతిష్టాత్మకం. తమ టీజర్ కు ఇన్ని వ్యూస్ అంటే మా ట్రయిలర్ కు ఇన్ని వ్యూస్ అన్నదే డిస్కషన్. ఒకప్పుడు కలెక్షన్ల విషయంలో ఇలా వుండేది. 

టౌన్ రికార్డు, థియేటర్ రికార్డు, జిల్లా రికార్డు, ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ ఇలా రకరకాలుగా. ఇప్పుడు యూ ట్యూబ్ కూడా ఇలాగే తయారయింది. ఎన్ని గంటల్లో ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్, ఫాస్టెస్ట్ లెక్కలు వగైరా. ఇందుకోసం కొన్ని సార్లు నిర్మాతలు చేతి ఖర్చు కూడా వదలుతోంది.

వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు రన్ చేయడం ద్వారా వ్యూస్ తేవడం అన్నది ఓ మార్గంగా వుంది. డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు ఇందుకోసం పుట్టుకువచ్చాయి. వన్ మిలియన్ వ్యూస్ రప్పించాలంటే కనీసం 40 వేల నుంచి రెండులక్షల వరకు ఖర్చవుతుందని బోగట్టా. 

వ్యూస్ పర్మనంట్ గా వుండాలా? మధ్యలో పోయినా ఫరవాలేదా? ముందు రన్ చేసి, తరువాత తీసేసినా ఓకెనా? వరల్డ్ వైడ్ గా ఏ ప్రాంతం నుంచి అయినా ఒకెనా, తెలుగు రాష్ట్రాల నుంచి కావాలా ? ఇలా రకరకాల ప్యాకేజ్ లు వున్నాయని తెలుస్తోంది.

ఇదిలా వుంటే బన్నీ-సుకుమార్ పుష్ప టీజర్ సర్రున దూసుకుపోయింది. యాభై మిలియన్ల వ్యూస్ సాధిస్తుంది అని అనుకున్నారు. ఈ లోగా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అఖండ టీజర్ వచ్చింది. అది దూసుకుపోవడం ప్రారంభమైంది. పుష్ప, అఖండ వ్యూస్ వెనుక ఎంత కొంత డిజిటల్ మార్కెటింగ్ వ్యవహారాలు వున్నాయని గుసగుసలు వున్నాయి. అయితే పర్సంటేజ్ లు తేడా అని టాక్.

ఇలాంటి నేపథ్యంలో పుష్ప కన్నా ముందే అఖండ 50 మిలియన్లు అయిపోయేలా కనిపించింది. దాంతో అర్జెంట్ గా పుష్ప టీమ్ రెండు మిలియన్ల వ్యూస్ కోసం ప్రకటనలకు ఖర్చు చేసారని ఇండస్ట్రీలోటాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ముందే పుష్ప యాభై మిలియన్ల రికార్డు వచ్చేసింది. ఇక మరో రోజులో అఖండ రికార్డు వార్తలు కూడా రాబోతున్నాయి. 

ఏది ఏమైనా టాలీవుడ్ హీరోలు, డైరక్టర్ల ప్రెస్టేజ్ పుణ్యమా అని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు డబ్బులు చేసుకుంటున్నాయి.

Show comments