ఎన్టీవీ చౌదరి పీకలమీదకు వచ్చింది

మొత్తానికి జూబ్లీ హిల్స్ సొసైటీ వ్యవహారాలు ఎన్టీవీ చౌదరి పీకలకు చుట్టుకున్నట్లే వుంది. దశాబ్దన్నర కాలంగా ఎన్నికలు జరిపీ జరపనట్లు చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి కోర్టుల జోక్యంతో ఎన్నికలు జరపాల్సి వచ్చింది. 

అధికారం చేజారిపోయాక అక్కడితో అయిపోతుందని అనుకున్నారు అంతా. కానీ కొత్తగా ఎన్నికైన సొసైటీ విషయాన్ని వదిలేయడం లేదు. జూబ్లీ హిల్స్ సొసైటీ అవకతవకలపై విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది.

నిజానికి జూబ్లీ హిల్స్ సొసైటీ వ్యవహారాలపై చాలా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. విచారణలు జరిగాయి. కానీ తేలిందీ లేదు. పనిష్ మెంట్ లేదు. కేవలం వార్తలు మాత్రం మిగిలాయి. ఈసారి ఏమవుతుందో మరి.

దాదాపు 1195 ఎకరాల జూబ్లీ హిల్స్ సొసైటీలో స్థలాలు చాలా మంది పెద్దలకు, వారి పిల్లలకు చాలా కీలకంగా దక్కాయి. సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారిలో చాలా మంది తమ తమ పిల్లలకు, కుటుంబీకులకు చాలా కీలకమైన స్థలాలు వచ్చేలా చేసుకున్నారని, అవి ఇప్పుడు వందల కోట్లుగా, తరగని ఆస్తులుగా మారాయని విమర్శలు వున్నాయి. 

ఇప్పుడు ఎన్టీవీ చౌదరి విషయంలో కూడా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలాలను ఫ్లాట్ లు గా మార్చేసి అద్దెలకు ఇచ్చేసారని, నామినల్ అద్దెలకు మాంచి కమర్షియల్ స్థలాలను అద్దెకు ఇచ్చేసారని, ఇంకా చాలా ఆరోపణలు చేస్తూ విచారణ కోరుతోంది కొత్త కమిటీ. దీని వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటే భ్రమే. 

కోర్టు కేసుల్లో ఏళ్ల పాటు నలుగుతుంది.చివరికి ఎక్కడో రాజీ కార్యక్రమం జరుగుతుంది. అంతకు మించి ఊహించడం అత్యాశే అవుతుంది.

Show comments