రామ్ సినిమా.. ఈసారి కూడా అంతంత మాత్రమే!

సంక్రాంతి సినిమాగా ఓ మోస్తరు అంచనాల మధ్య రిలీజైంది రెడ్ సినిమా. కానీ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ మూవీతో రామ్ సంక్రాంతి హీరో అనిపించుకోలేకపోయాడు. థియేటర్లలో ఎలాగైతే ఈ సినిమా యావరేజ్ అనిపించుకుందో, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా దాదాపు అదే రెస్పాన్స్ రాబట్టింది రెడ్.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కింద జెమినీ ఛానెల్ లో తాజాగా రెడ్ సినిమాను ప్రసారం చేశారు. అలా తొలిసారి టీవీల్లో ప్రసారమైన ఈ సినిమాకు జస్ట్ 5 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఈ సినిమాకు ఇది భారీ రేటింగ్ కాదు, అలా అని రామ్ మార్కెట్ తో పోల్చి చూసుకుంటే తక్కువ రేటింగ్ కూడా కాదు.

ఓ పెద్ద సినిమా ప్రీమియర్ గా టీవీల్లో ప్రసారమైనప్పుడు ఆ సెగ్మెంట్ లో, ఆ వారం ఆటోమేటిగ్గా అదే టాప్ లో ఉంటుంది. కానీ రెడ్ సినిమా కంటే రవితేజ క్రాక్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు రిపీట్స్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేశాయి. అలా రామ్ సినిమా కథ అటు థియేటర్లలో, ఇటు టీవీల్లో యావరేజ్ గా ముగిసిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ హ్యాంగోవర్ లో తనను మాస్ గెటప్ లో చూసేందుకు ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని భ్రమపడిన రామ్ కు రెడ్ సినిమా చిన్నపాటి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 

ఈ సినిమా తర్వాత ఎప్పట్లానే మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్.

Show comments