మరో టాలీవుడ్ హీరోకు కరోనా పాజిటివ్

టాలీవుడ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ కరోనా బారిన పడ్డాడు. మెగా కాంపౌండ్ హీరో, చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కు కరోనా సోకింది. తనకు కరోనా సోకిన విషయాన్ని కల్యాణ్ దేవ్ స్వయంగా ప్రకటించాడు.

తనకు నిన్ననే కరోనా సోకిన విషయం తెలిసిందని, వెంటనే ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని కల్యాణ్ దేవ్ ప్రకటించాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తంచేశాడు.

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో షూటింగ్స్ మెల్లమెల్లగా మొదలైన వేళ.. అందరికంటే కాస్త ముందుగా సెట్స్ పైకి వచ్చిన వ్యక్తి కల్యాణ్ దేవ్. సూపర్ మచ్చి సినిమాకు సంబంధించి రీషూట్ లో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. ఆ టైమ్ లో ఇంటికి దూరంగా సెపరేట్ గా ఉంటూ షూటింగ్ పూర్తిచేశాడు.

అలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తాజాగా మరో సినిమా షూటింగ్ లో వైరస్ బారిన పడ్డాడు ఈ హీరో. ప్రస్తుతం కిన్నెరసాని సినిమాతో పాటు పీపుల్ మీడియా బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు కల్యాణ్ దేవ్. 

అతడు నటించిన సూపర్ మచ్చి సినిమా ఫస్ట్ కాపీతో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రేపోమాపో రిలీజ్ డేట్ ప్రకటిస్తారనగా, మరోసారి కరోనా వ్యాపించి విడుదల నిలిచిపోయింది.

Show comments