సిక్కోలు కి ఏమైంది..?

శ్రీకాకుళం జిల్లా ఇపుడు టాక్ ఆఫ్ ది ఏపీ గా మారిపోయింది. అంతే కాదు భయానకంగా పరిస్థితి మారుతోంది. అంధ్ర రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు ఇపుడు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు కావడం ఆశ్చర్యమే కాదు, షాక్ గా కూడా ఉంది. 

రాష్ట్రంలోని రోజుకు వేయి కేసులు దాటిన జిల్లాలు నాలుగైదు ఉంటే ఏకంగా రోజుకు పదిహేను వందలకు తక్కువ కాకుండా కేసులు శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు అవుతున్నాయి.

పొరుగున ఉన్న విజయనగరంలో అయిదు వందల కేసులు ఉంటే మహా విశాఖలో ఎనిమిది వందల కేసులు మాత్రమే ఉన్నాయి. మరి ఉన్న ఫళంగా ఇన్నేసి కేసులు శ్రీకాకుళం జిల్లాలోనే నమోదు కావడం వెనక కారణం ఏంటి అన్న చర్చ అయితే ఉంది.

అయితే వలసల జిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళంలో కేసులు ఇలా వీరవిహారం చేయడానికి అన్ని ప్రాంతాల నుంచి వలస కూలీలు సొంత జిల్లాకు చేరుకోవడమే అంటున్నారు. ముఖ్యంగా ముంబై నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

శ్రీకాకుళంలో అంతకంతకు పెరుగుతున్న కేసులను చూస్తే కరోనా హాట్ స్పాట్ గా ఈ జిల్లా మారుతుందా అన్న ఆందోళన కూడా అధికారుల్లో ఉంది. చిత్రమేంటంటే గత ఏడాది కరోనా మొదటి దశలో కొన్నాళ్ళ వరకూ కరోనా కేసుల్లో జీరో నంబర్ గా ఈ జిల్లా ఉంది. 

ఇపుడు సెకండ్ వేవ్ లో ఏపీలోనే శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ రావడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

Show comments