సలార్ లో శృతిహాసన్ పాత్ర ఇదే!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సలార్ లో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడనే మేటర్ ఇప్పటికే బయటకొచ్చింది. మరి ఇందులో శృతిహాసన్ క్యారెక్టర్ ఏంటి?

సలార్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది శృతిహాసన్. సినిమాలో ఆమె పాత్ర నిడివి చిన్నదనే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టాం. ఆ చిన్న పాత్రతోనే సినిమాను మలుపుతిప్పే సన్నివేశాల్లో శృతిహాసన్ కనిపిస్తుంది. అదే జర్నలిస్ట్ పాత్ర.

నిజానికి శృతిహాసన్ కు జర్నలిస్ట్ పాత్ర కొత్త కాదు. గతంలో సూర్య నటించిన సింగం-3లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది ఈ బ్యూటీ. ఇప్పుడు దాదాపు అదే తరహా పాత్రను సలార్ లో కూడా పోషిస్తోంది.

సలార్ సినిమాకు సంబంధించి శృతిహాసన్ ఇప్పటికే సెట్స్ పైకి వచ్చింది. ప్రభాస్-శృతిపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చే నెల నుంచి ఆమె మరోసారి సలార్ సెట్స్ పైకి రావాల్సి ఉంది. 

దీని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ నిర్మించారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, షూటింగ్స్ జరపకూడదని, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సూచించిన నేపథ్యంలో.. సలార్ సినిమా కొత్త షెడ్యూల్ డైలమాలో పడింది.

Show comments