డైరక్టర్ ను నిలదీసిన రైటర్?

సాధారణంగా డైరక్టర్లు అనుకున్నది రైటర్ల నుంచి రాబట్టుకుంటారు. తాము అనుకున్నది రాకబోతే రైటర్లపై విసుక్కోవచ్చు. కానీ ఇది రివర్స్ కేసు. 

విడుదల కాబోయే ఓ సినిమా రష్ ను యూనిట్ చూసుకుందని తెలుస్తోంది. ఈ రష్ చూసిన తరువాత సినిమాకు రైటర్ గా పని చేసిన వ్యక్తి ఆ డైరక్టర్ ను నిలదీసినట్లు తెలుస్తోంది.

చెప్పిన స్క్రిప్ట్ ఏమిటి? రాయించుకున్న డైలాగులు ఏమిటి? వచ్చిన అవుట్ పుట్ ఏమిటి? అని ఆ కొత్త డైరక్టర్ ను నిలదీసినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా ఆడుతుందా? ఆడదా? అన్నది తరువాత, జనాలకు నచ్చుతుందా? నచ్చదా అన్నది తరువాత..ఇకపై తాను మాత్రం ఆ డైరక్టర్ తో పని చేయాలని మాత్రం అనుకోవడం లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

ఓ రైటర్ ఇంతలా డైరక్టర్ ను నిలదీయడానికి కారణం ఏమై వుంటుంది? రైటర్ వెర్షన్ ను పక్కన పెట్టి, తన వెర్షన్ ను చేసేసారా? లేక నిజంగానే సినిమా బాగా రాలేదా? ఏమిటి కథ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

Show comments