కెజిఎఫ్ 2 కోసమేనా ఈ హడావుడి?

ఒ ఫాన్ ఇండియా భారీ సినిమా ప్రొడక్షన్ లో వుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైంది. వర్క్ జరుగుతోంది. ఆ హడావుడి అంతా అలాగే వుండగా, మరో పాన్ ఇండియా సినిమా హడావుడి స్టార్ట్ చేసి, మరింత హడావుడి చేస్తున్నారంటే..ఏమిటి? అన్నది టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్.

ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా విడుదల 2022 ఏప్రియల్ అని ఏడాది మీద రెండు నెలలు ముందుగా ప్రకటించేసారు. అదే భలే గమ్మత్తుగా వుంది. కేజిఎప్ 2 సినిమాను నిర్మాతలు అమ్మడం లేదు. కేవలం డిస్ట్రిబ్యూషన్ కే ఇస్తున్నారు. కానీ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లు మాత్రం ఓ రేంజ్ లో అడుగుతున్నారు.

నైజాం ఏరియాకే 80 కోట్ల దగ్గర స్టార్ట్ చేసి 50 కోట్లకు పైగా అడ్వాన్స్ తీసుకుంటున్నారని టాక్. నైజాంలో 50 కోట్లు వసూలు చేయడం అంటే సినిమా బ్లాక్ బస్టర్ కాదు...అంతకన్నా పెద్ద పదం ఏదో వాడాలి. అదే విధంగా మిగిలిన ఏరియాల అడ్వాన్స్ లు కూడా వున్నాయి.

ఈ అడ్వాన్స్ లు అన్నింటికీ భరోసానే ఈ సలార్ హడావుడి అని టాలీవుడ్ లో వినిపిస్తోంది. కేజిఎప్ 2 మీద భారీగా అడ్వాన్స్ లు లాగేందుకు వీలుగా సలార్ ను తురుపు ముక్కగా వాడుతున్నారని జనాలు అనుకుంటున్నారు.

రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తే జనం ధైర్యంగా అడ్వాన్స్ లు కట్టే అవకాశం వుంటుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ లెక్క వేరుకదా. దానికి ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ఇచ్చాం అనుకుని కేజిఎప్ 2 కు కట్టడమే. 

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

Show comments