పవన్ Vs గ్రంధి.. మాటల తూటాలు

పంచాయతీ ఎన్నికల ప్రహసనం ముగిసినా కొన్ని చోట్ల పార్టీల మధ్య విబేధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా పంచాయతీ ఎన్నికలతో సంబంధం లేకపోయినా.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య కొన్ని రోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి.

తమ పార్టీకి చెందిన దళిత మహిళా అభ్యర్థిని కించపరిచారంటూ పవన్ ఆరోపిస్తే, జనసైనికులు తనను ఎర్ర కండువాలతో అవహేళన చేశారంటూ గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. కోపం వస్తే గట్టిగా సమాధానం చెబుతామంటూ పవన్ ఆగ్రహిస్తే.. మేం గాజులు తొడుక్కొని కూర్చోలేదంటూ గ్రంధి గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

గడిచిన కొన్ని గంటలుగా పవన్, గ్రంధి శ్రీనివాస్ మధ్య పేలుతున్న మాటల తూటాల్ని బ్యాక్ టు బ్యాక్ చూద్దాం.

గ్రంధి శ్రీనివాస్: పవన్ రకరకాల వేషాలు వేస్తున్నారు. వాటిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. పవన్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలీదు కానీ, యువతను రెచ్చగొట్టి అరాచక శక్తులుగా మారుస్తున్నాడు. అవాంఛనీయ ఘటనల్ని ప్రేరేపిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా యువతను పవన్ ప్రేరేపిస్తున్నాడు. ఇది మానుకోవాలి. ఇలాంటి అరాచక శక్తులతో ఉన్న పార్టీని ఎన్నికల సంఘ రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను.

పవన్ కల్యాణ్: పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాల్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే భీమవరం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేస్తున్నారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ. కో-ఆపరేటివ్ బ్యాంక్ ను దోచేసిన వ్యక్తి ఈయన. మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు పిచ్చి కుక్క కరుస్తుంది. తిరిగి మనం కరవకూడదు. మున్సిపాల్టీ వ్యాన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఆ పిచ్చికుక్కను వ్యాన్ లో పడేస్తాం. నేను మాటిస్తున్నాను, మున్సిపాల్టీ వ్యాన్ వస్తుంది, పిచ్చికుక్కను పట్టుకెళ్లిపోతుంది.

గ్రంధి శ్రీనివాస్: నన్ను పిచ్చికుక్కల వ్యాన్ లో వేసి పంపిస్తానన్నారు. కానీ 2 చోట్ల ప్రజలు పవన్ ను అదే పిచ్చి కుక్కల వ్యాన్ లో వేసి పంపించారు. పవన్ ఓ స్టేట్ రౌడీ. జనసైనికులు ఆకు రౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు. అజ్ఞానంతో మాట్లాడుతున్న పవన్ ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. పవన్ ఓ మానసిక రోగి. 

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

Show comments