రాజమౌళి-మహేష్..ఇప్పట్లో కాదా?

ఎప్పటి నుంచో వినిపిస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు - రాజమౌళి - కెఎల్ నారాయణ. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు తీసి బాకీ తీర్చాల్సిన అడ్వాన్స్ లు రెండే రెండు. ఒకటి దానయ్య సినిమా. అదే ఆర్ఆర్ఆర్. మరొకటి కేఎల్ నారాయణ అడ్వాన్స్. మహేష్ బాబుతో ఆ సినిమానే చేయాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ సినిమానే అని ఇప్పటికే బలమైన టాక్ వుంది. 

అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇఫ్పట్లో స్టార్ట్ కాదు అని తెలుస్తోంది. కనీసం రెండేళ్లకు పైగా పడుతుందని వినికిడి. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తరువాత కనీసం రెండు సినిమాలు చేయాలనుకుంటున్నారని, ఆ తరువాత రాజమౌళి సినిమా అని వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి, వెంకీ కుడుమల, సుకుమార్, కొరటాల శివ ఇలా. 

రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ తరువాత కనీసం ఏడాది విశ్రాంతి తీసుకుంటారని టాక్. ఆరు నెలలు విశ్రాంతి, ఆ తరువాత ఆరు నెలలు ఏ సినిమా చేయాలన్న ప్లానింగ్ తో సరిపోతుందని, ఆ లెక్కన 2022 లో రాజమౌళి సినిమా అన్నది జస్ట్ ప్లానింగ్ లో తప్ప, యాక్షన్ లోకి రాదు అని లెక్కలు కడుతున్నారు. 

అందుకే ఈ లోగా రెండు సినిమాలు చేసేయాలన్నది మహేష్ ఆలోచన. పైగా అభిమానులు కూడా రాజమౌళి సినిమా మీద పెద్దగా ఆసక్తి గా లేరని వినిపిస్తోంది. రాజమౌళి సినిమా మీదుకు వెళ్తే కనీసం రెండేళ్ల పాటు మహేష్ లాక్ అయిపోతారని అది అంత మంచిది కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. 

ఇవన్నీ దృష్టిలో వుంచుకుని 2023 వరకు రాజమౌళి-మహేష్ కాంబినేషన్ మెటీరియలైజ్ కాదని, ఒక వేళ అప్పుడు కూడా మెటీరియలైజ్ అయినా, ఈ గ్రాఫిక్స్ లు, ఏళ్లకు ఏళ్లు పట్టే సినిమా మాత్రం వుండదని టాక్ వినిపిస్తోంది. 

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి

Show comments