రంగ్ దే కు ఫైనల్ టచప్ లు

నితిన్-కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తయారుచేసిన సినిమా రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. నిజానికి షూటింగ్ కోసం మిగిలిన చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు నిన్న మొన్న పూర్తయినా, సినిమా దాదాపు ఫైనల్ కట్ ఎప్పుడో లాక్ అయిపోయింది.

ఈవారంలో నితిన్ డబ్బింగ్ కూడా చెప్పాల్సి వుంది. అయితే సినిమా కు ఎక్కడా ఏ లూప్ హోల్ వుండకూడదని ఓ స్క్రిప్ట్ స్పెషలిస్ట్ ను తీసుకువచ్చి సినిమా మొత్తం చూపించినట్లు బోగట్టా.

ఆ తరువత ఆ పర్సన్ లిస్ట్ అవుట్ చేసిన చిన్న చిన్న కట్ లు, ఇతతర్రా వర్క్ లు అంతా ఇప్పుడు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఆపైన ఫైనల్ కాపీని మూడు, నాలుగు తేదీల్లో నితిన్ డబ్బింగ్ కు అందిస్తారు.

ఇప్పటికే రెండు సినిమాలు అందించారు వెంకీ అట్లూరి. కానీ వెంకీ అట్లూరి సినిమాను వేరే స్క్రిప్ట్ స్పెషలిస్ట్ కు చూపించడంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినా, మరో సినిమా కూడా అదే బ్యానర్ లో చేయాల్సి వున్నందున వెంకీ అట్లూరి మౌనంగా వున్నట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి

Show comments