పవన్ ప్లేస్ లో తమిళ స్టార్?

రామ్ చరణ్ హీరోగా తమిళ టాప్ డైరక్టర్ శంకర్ సినిమా చేయబోతున్నారని గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అదే వార్త అధికారికంగా బయటకు వచ్చింది. 

ఈ సినిమాలో హీరోతో సమానమైన ఓ కీలకపాత్ర వుందని దాన్ని పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారని కూడా వెల్లడించాం.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో, రాజకీయాలతో బిజీగా వుండడం, ఈ సినిమా షూటింగ్ కొంత వరకు చెన్నయ్ లో జరపాల్సి వుండడం, అన్నింటికి మించి ఈ సినిమాను తమిళంలో కూడా నిర్మిస్తారు కనుక, అక్కడ స్టార్ ను ఎవరినైనా ఆ పాత్రకు తీసుకోవాలని దర్శకుడు శంకర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. దీని మీద డిస్కషన్లు మాత్రం సాగుతున్నాయి. తమిళ నటులు ఎవరు అవలైబుల్ గా వుంటారు. దాంతో సినిమాకు మల్టీ లాంగ్వేజ్ లుక్ ఏ మేరకు వస్తుంది ఇలాంటివి అన్నీ లెక్కలు కడుతున్నారు. 

విశాఖలో వైసీపీ ఓడిపోతే

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

Show comments