ఎమ్మెల్యేలపై పాదయాత్ర భారం

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందని సామెత. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో తలపెట్టిన పాదయాత్ర ఎమ్మెల్యేల చేతి చమురు వదిలించింది. ప్రతి ఎమ్మెల్యేకు కోటా విధించడంతో, స్వంత ఖర్చుతో జనాలను పాదయాత్రకు తరలించాల్సి వచ్చింది.

ప్రతి ఎమ్మెల్యే పదుల కొద్దీ బస్సులు, వాహనాలు ఏర్పాటుచేసారు. ప్రతి గ్రామానికి ఓ బస్ కేటాయించారు. కనీసం ముఫై మందిని తీసుకురావాలని పార్టీ లోకల్ లీడర్లకు టార్గెట్ పెట్టారు. 

దాంతో లోకల్ లీడర్లు లోకల్ జనాల భోజనాలు ఇతరత్రా ఖర్చు పెట్టుకుని బస్ లు నింపి పాదయాత్రకు జనాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. విశాఖ మేయర్ ను కార్పొరేటర్లను గెల్చుకోవాల్సిన బాధ్యత, భారం విజయసాయి మీద వుంది.

ఇన్నాళ్లు విశాఖలో విజయసాయి ఆడింది ఆటగా వుంది. స్టీల్ ప్లాంట్ సమస్య వచ్చి మొత్తం మారిపోయింది. ఇలాంటి టైమ్ లో మేయర్ ఎన్నికలు వచ్చాయి. విశాఖలో తెలుగుదేశం పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా వున్న సామాజిక వర్గం విజయసాయి మీద గుర్రుగా వుంది.

మేయర్ ఎన్నికలో విజయబావుటా ఎగరేయడం ద్వారా విజయసాయిని గట్టిగా దెబ్బతీయాలని పట్టుదలతో వుంది. ఇలాంటి నేపథ్యంలో విజయసాయి ఈ పాదయాత్రను తలపెట్టారు. దానిని విజయవంతం చేసే బాధ్యత ఎమ్మెల్యేల మీద వేసారు. వారు దాదాపు దాన్ని దిగ్విజయం చేసారు. 

తెలంగాణలో రాజన్న రాజ్యం

ఇది చాలా కష్టం మోహన్ బాబూ

Show comments