శ్రీకారం రేటు ఘాటు?

పడి పడి లేచె మనసు, రణరంగం, జాను లాంటి మూడు డిజాస్టర్ల తరువాత శర్వానంద్ చేస్తున్న సినిమా శ్రీకారం. రైతుల సమస్యలు, రైతు కొడుకు రైతు కావడం వంటి సబ్జెక్ట్ ఆధారంగా కొత్త దర్శకుడితో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న సినిమా. 

ఈ సినిమాకు ఆంధ్ర 8 కోట్ల రేషియో లో బిజినెస్ చేయాలని చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎప్పడో ఫిక్స్ అయ్యారు. రెగ్యులర్ గా 14 రీల్స్ ప్లస్ సినిమాలు చేసేవారే. కానీ ఆంధ్ర 8 కోట్ల రేషియో అంటే వారంతా వెనుకంజ వేస్తున్నట్లు బోగట్టా. 

ఇప్పటికి రెండు పాటలు వచ్చాయి ఓకె అనిపించుకున్నాయి. మూడో పాట వచ్చింది అస్సలు క్లిక్ కాలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రకు 8 కోట్ల రేషియో అంటే చాలా కష్టం అని ఓ బయ్యర్ అన్నారు. 

నితిన్ రంగ్ దే ఆంధ్ర 10 కోట్ల రేషియోలో అమ్ముడయింది. అలాగే చెక్ కూడా ఏడెనిమిది కోట్ల రేషియోకి వెళ్లింది. శర్వానంద్ రేంజ్ హీరోలందరి సినిమాలు ఆంధ్ర 8 నుంచి 10 కోట్ల రేషియోలోనే వెళ్తున్నాయి. కానీ శ్రీకారం దగ్గరకు వచ్చేసరికి మాత్రం బయ్యర్లు బేరాలు ఆడుతున్నారని బోగట్టా. 

పైగా శ్రీకారం విడుదలవుతున్న రోజే నాగ్ అశ్విన్ 'జాతి రత్నాలు', అనిల్ రావిపూడి గాలి సంపత్ సినిమాలు పోటీగా వున్నాయి. జాతిరత్నాలు సినిమాను 8 కోట్ల రేషియోలో ఆంధ్రలో మార్కెట్ కంప్లీట్ చేసేయడం విశేషం. 

శర్వానంద్ తన కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసిందని టాలీవుడ్ లో సలహాలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణలో రాజన్న రాజ్యం

ఇది చాలా కష్టం మోహన్ బాబూ

Show comments