ఇది పందెం కోడి 3

చిరకాలంగా తన సబ్జెక్ట్ లతో హీరోలను ఒప్పించడానికి కిందా మీదా అవుతున్న దర్శకుడు లింగుస్వామి. అటు తమిళ హీరోలు, ఇటు తెలుగు హీరోలు కూడా దాదాపు నో..నో అంటున్న వేళ మాస్ హీరో రామ్ సై అన్నాడు. 

ఏ లైన్ విని ఒకే అన్నాడు? ఇది టాలీవుడ్ లో వినిపిస్తున్న సందేహం. చిరకాలంగా రామ్ ఓ మాంచి మాస్ యాక్షన్ సినిమా చేయాలని తెగ వెదుకుతున్నాడన్నది వాస్తవం. దగ్గరకు వచ్చిన మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లను సైతం నో అన్నాడు. 

యాక్షన్ లైన్ తెమ్మని కోరాడు. అందువల్ల ఇప్పుడు చేస్తున్నది యాక్షన్ సినిమానే అని ప్రత్యేకంగా అనుకోనక్కరలేదు. కానీ ఎంత యాక్షన్ సినిమా అయినా అందులో కాస్తయినా కథ వుండాలి. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం రామ్ తో చేయబోయే సినిమా పందెం కోడి మాదిరిగా లోకల్ పాలిటిక్స్ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసి వుంటాయని తెలుస్తోంది. 

ఇప్పటికే కథ, కథనాలు ఎలా వుండబోతున్నాయో హీరోయిన్ కృతి శెట్టికి నెరేషన్ ఇచ్చారు. ఆమెతో ఫైనల్ అగ్రిమెంట్ కావాల్సి వుంది. 

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది

Show comments