డిస్ట్రిబ్యూటర్ పై డైరక్టర్ ఆగ్రహం

సాధారణంగా డైరక్టర్లకు డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా లావాదేవీలు వుండవు. కానీ ఇప్పడు టాలీవుడ్ లో జనరేషన్ మారింది. డైరక్టర్లు కూడా ఏరియాలను వుంచుకోవడం, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పెట్టడం, అలాగే తమ మిత్రులకు సినిమా హక్కులు ఇప్పించడం ఇలాంటి వ్యవహారాలు చేపడుతున్నారు. 

అందువల్ల అందునా ఓ పెద్ద డైరక్టర్ అయితే కేవలం డైరక్షన్ మాత్రమే కాకుండా, టోటల్ మార్కెటింగ్ అంతా ఆయన చేతుల్లోనే వుంచుకుంటారు. సినిమా విడుదలయిన తరువాత బయటకు చెప్పాల్సిన కలెక్షన్లు కూడా ఆయన కనుసన్నలలోనే జరుగుతాయి. 

కానీ ఓ ఏరియా మాత్రం ఆయనకు కొరుకుడు పడడం లేదని బోగట్టా. అది పెద్ద ఏరియా కావడం, అవతల పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావడం అన్నది ఆయనకు ఇబ్బందిగా మారిందని బోగట్టా. 

చాలా పెద్ద హీరోల సినిమాలు ఫిగర్స్, తన సినిమా ఫిగర్స్ కన్నా ఎక్కువగా వుండడం సదరు డైరక్టర్ ను ఇబ్బంది పెడుతోంది. దీనంతటికి కారణం ఆ పెద్ద  డిస్ట్రిబ్యూటర్ అని ఆ డైరక్టర్ తెగ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. 

దాంతో పట్టు పట్టి తన లేటెస్ట్ సినిమాను వేరే డిస్ట్రిబ్యూటర్ కు ఇప్పించారట. ఇప్పుడు తన సినిమా కు ఫిగర్స్ ఎందుకు కనిపించవో చూస్తానని  డైరక్టర్ కామెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంకెలు కనిపించేలా చేస్తే చాలన్నమాట. సినిమా సరిగ్గా ఆడినా, ఆడకున్నా.  

షీ హేజ్ టు గో ఎ లాంగ్ వే

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

Show comments