విరాటపర్వం..ఆచార్య..రానా..చరణ్

రానా-సాయిపల్లవిల కాంబినేషన్ లో తయారవుతోంది విరాటపర్వం...రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ తో రెడీ అవుతోంది ఆచార్య. ఈ సినిమాల డేట్ లు రెండూ వచ్చేసాయి. కానీ ఇప్పుడు విరాటపర్వం టైమ్ కు వస్తుందా? అన్నది అనుమానంగా వుంది. ఈ మేరకు గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే రెండు సినిమాల్లోనూ కాస్త నక్సలిజం నేపథ్యం వుంది. అయితే రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్ల విషయంలోనో, ఒకటి రెండు సీన్ల విషయంలోనో సిమిలారిటీలు వున్నాయని బోగట్టా. దాంతో ఇప్పుడు ఈ విషయంలో విరాటపర్వం యూనిట్ పునరాలోచనలు చేస్తోందని, అందువల్ల సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది.

అదే కనుక జరిగితే ఆ డేట్ కు అంటే ఏప్రిల్ 30 కి వెంకీ నారప్పను విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి నారప్ప మే 7 కు షెడ్యూలు అయి వుంది. అంటే వారం ముందుకు వస్తుందన్నమాట.

ఇదిలా వుంటే ఏప్రియల్ 30 కి రావాల్సిన నాగశౌర్య లక్ష్య సినిమా కూడా వాయిదా పడే అవకాశం వుంది. ఆ సినిమా వర్క్ ఇంకా బాకీ వుంది. పైగా నారప్ప లాంటి పెద్ద సినిమా వోస్తే దారివ్వక తప్పదు.

ఉప్పెనంత వసూళ్లు

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?

Show comments