చంద్ర‌బాబూ.. త‌మ‌రి రెండు మాట‌ల‌కూ ఏమైనా సంబంధం ఉందా?

తొలి రోజు ఏమ‌న్నారంటే.. పంచాయ‌తీ ఎన్నిక‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌త‌నానికి నాంది, ఆ త‌ర్వాత ఏమ‌న్నారంటే, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తీవ్ర అక్ర‌మాలు జ‌రుగుతున్నాయి, ఎస్ఈసీ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు... ఇదీ క‌థ‌.

చంద్ర‌బాబు నాయుడుకు ఏదో అయ్యింది, ఆయ‌న మాన‌సికంగా జ‌బ్బు ప‌డ్డారు  అంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు దశాబ్ద‌కాలం కింద‌టే విమ‌ర్శించే వాళ్లు. ఆయ‌న‌కు ఏమైందో ఏమో బ‌య‌ట వాళ్ల‌కు తెలియ‌దు కానీ, ఆయ‌న మాట్లాడే మాట‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేక‌పోవ‌డమే విడ్డూరం. 

ఒక్క విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీదే రెండు ర‌కాలుగా స్పందించ‌డం చంద్ర‌బాబు నాయుడుకే చెల్లింది. ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పుడేమో అవి త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని, తాము 38 శాతం చిల్ల‌ర ఓట్ల‌ను పొందిన‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా ప్ర‌క‌టించేసుకున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలి విడ‌త ఫ‌లితాల‌తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌త‌నం ప్రారంభం అయ్యిందంటూ కూడా తేల్చేశారు! అప్పుడు ఎంతో ఉత్సాహంగా.. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి కౌంట్ డౌనే అన్న‌ట్టుగా మాట్లాడిన చంద్ర‌బాబు నాయుడు, వెంట‌నే  మాట మార్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌లను ఎస్ఈసీ స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌ని తేల్చారు!

త‌మ‌కు సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ఒక‌వైపు చెప్పుకుంటూ,  ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు స‌రిగా లేద‌ని మ‌రో వైపు అంటూ.. చంద్ర‌బాబు నాయుడు ఏం చెప్ప‌ద‌లుచుకున్నార‌నేది జ‌నాల‌కు క‌న్ఫ్యూజ‌న్ గా మారుతోంది.

రెండు క‌ళ్ల సిద్ధాంతాల‌ను అల‌వాటుగా చేసుకుని, ఆయ‌న త‌ను మాట్లాడిన దానికి  మ‌ళ్లీ త‌నే విరుద్ధంగా మాట్లాడ‌టం, అడ్డ‌గోలుగా మాట్లాడ‌టాన్ని అల‌వాటుగా మార్చుకున్నారు. రోజుకొక‌లాగా మాట్లాడుతూ.. త‌న పార్టీ నేత‌ల‌నూ, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా చంద్ర‌బాబు నాయుడు పిచ్చోళ్ల‌ను చేస్తున్న‌ట్టుగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.

పక్కవాళ్ల మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటే

పోస్కోకు, సీఎం జగన్‌కు ఎలాంటి సంబంధంలేదు

Show comments