రాధిక బ‌ల‌హీన‌త‌ను బయ‌ట పెట్టిన లేడీ విల‌న్‌...

దాచి పెడితే అది ర‌హ‌స్య‌మ‌వుతుంది. బ‌హిరంగ ప‌రిస్తే అది ర‌హ‌స్యం కాకుండా, మ‌రేదైనా అవుతుంది. ఆత్మీయుల‌ని భావించి కొన్ని విష‌యాలను షేర్ చేసుకుంటే, అలాంటి వాటిని కూడా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుంటారు. మ‌నుషుల‌పై న‌మ్మ‌కానికి సంబంధించిందే ర‌హ‌స్యం. 

కొంత మంది మ‌న‌సులో సీక్రెట్‌ను అస‌లు దాచుకోలేరు. అది వారి బ‌ల‌హీన‌త‌. అలాంటి వారిలో ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికా ఒక‌రు. ఈ విష‌యాన్ని రాధిక‌కు బాగా కావాల్సిన న‌టి, టాలీవుడ్ లేడీ విల‌న్ పాత్ర‌ధారి వ‌ర‌ల‌క్ష్మి చెప్పుకొచ్చారు.

కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ కుమార్తెగా న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమ‌య్యారు. అయితే వెండితెర‌పై రాణించ‌డం ఆమెకు అంత సుల‌భం కాలేదు. ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొని త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారామె. 

తాజాగా టాలీవుడ్‌లో విడుద‌లైన ‘క్రాక్‌’ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి లేడీ విల‌న్ పాత్ర‌లో శ‌భాష్ అనిపించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న తండ్రి జీవిత భాగ‌స్వామి అయిన రాధిక గురించి కొన్ని విష‌యాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

రాధికా ఆంటీ చాలా మంచి వ్య‌క్తి అని అన్నారు. రాధిక‌, తాను చాలా స‌ర‌దాగా ఉంటామ‌న్నారు. అయితే ఆమెతో వ‌చ్చే చిక్క‌ల్లా ... ఏదైనా సీక్రెట్ అని చెబితే ఏ మాత్రం మ‌నసులో దాచుకోలేర‌న్నారు. ఏదో ఒక సంద‌ర్భం చూసుకుని అంద‌రి ఎదుట ఆ ర‌హ‌స్యాన్ని రాధిక చెబుతుంద‌ని వ‌ర‌ల‌క్ష్మి న‌వ్వుతూ తెలిపారు. 

ఇది త‌న స్వీయానుభ‌వమ‌ని వ‌ర‌ల‌క్ష్మి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంద‌రి ముందు రాధిక సీక్రెట్ చెప్పే సంద‌ర్భంలో తాను అడ్డుకుని, అది ర‌హ‌స్య‌మ‌ని, చెప్ప‌కండ‌ని స‌ర‌దాగా మాట్లాడుకున్న విష‌యాల‌ను వ‌ర‌ల‌క్ష్మి పంచుకున్నారు.  

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

Show comments