షేకింగ్ న్యూస్-చరణ్-పవన్..శంకర్?

విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న వార్త ఇది. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో సెన్సేషన్ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లే. ఇదే వాస్తవరూపం దాలిస్తే ఆర్ఆర్ఆర్ తరువాత మళ్లీ టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు వార్తలు సదా వినిపించే సినిమాకు అంకురార్పణ జరిగినట్లే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటేనే సెన్సేషన్ న్యూస్. మెగా ఫ్యాన్స్ ను ఊపేసే వార్త. అలాంటి సినిమాకు పలు భారీ హిట్ సినిమాలు అందించిన 'రోబో' శంకర్ దర్శకత్వం వహిస్తారు అంటే అది ఇంకా ఇంకా సెన్సేషన్ న్యూస్ అవుతుంది.

ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ఓ బడా తెలుగు నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా శంకర్ ఇప్పటికే చరణ్ కు, నిర్మాతకు నెరేషన్ ఇఛ్చేసారు. ఇక పవన్ కళ్యాణ్ కు నెరేషన్ ఇవ్వాల్సి వుంది. ఆయన ఓకె అనేస్తే చాలు సినిమా ఓకె అయిపోయినట్లే. అలా ఓకె అంటే పవన్ చేయాల్సిన  సినిమాల జాబితాలో మరో సినిమా చేరుతుంది.

రామ్ చరణ్ మెయిన్ హీరో అయినా, పవన్ కళ్యాణ్ కు కూడా పూర్తి నిడివి పాత్ర వుంటుందని తెలుస్తోంది. ఇది గతంలో శంకర్ సినిమాల మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. దీనికి గ్రాఫిక్స్ లాంటి భారీ హంగులు ఏమీ వుండవు. అందువల్ల వీలయినంత త్వరగా ఫినిష్ చేయడానికి అవకాశం వుంది.

శంకర్ ప్రస్తుతం చేయాల్సిన ఇండియన్ సినిమా ఆగింది. కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా వున్నారు కాబట్టి అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. ఆ లోగా శంకర్ ఈ సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్. ఆర్ఆర్ఆర్, ఆచార్యల తరవాత చరణ్ చేసే సినిమా ఇదే.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జగన్ పై దొంగదెబ్బే గత్యంతరమా?

Show comments