అల్లుడు ప్రాఫిటబుల్-బెల్లంకొండ

అల్లుడు అదుర్స్ సినిమా పక్కా కమర్షియల్ అండ్ ప్రాఫిటబుల్ సినిమా అని హీరో సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ అన్నారు. 

సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచీ తాము ఓ కమర్షియల్ సినిమానే తీసుకున్నామని చెప్పామని, అంతే తప్ప శంకరాభరణం, సప్తపది తీస్తున్నామని చెప్పలేదన్నారు. సినిమాకు రెవెన్యూ కావాలి.

రెవెన్యూనే కీలకం. సినిమాకైనా హీరోలకైనా అని ఆయన అన్నారు. ఆ లెక్కల్లో చూసుకుంటే తమ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్ అని బెల్లంకొండ సురేష్ పేర్కోన్నారు. 32 కోట్లు ఖర్చయితే 22 కోట్లకు పైగా నాన్ థియేటర్ నుంచి వచ్చాయని, తొలి వారంలోనే పది కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని. ఇక మిగిలినది లాభమే కదా అని ఆయన వివరించారు.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కమర్షియల్ సినిమా తీసి ఇచ్చాడని తమకు అదే కావాలని ఆయన అన్నారు. అలాగే హీరో ఓవర్ యాక్షన్ చేసాడంటున్నారని, ఓవర్ యాక్షన్ కాకుండా ఫన్, కామెడీ సినిమాలు ఎలా వుంటాయని ఆయన ఫ్రశ్నించారు. 

అల్లుడు శ్రీను సినిమాతో తొలి సినిమాకు ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకున్న హీరోగా రికార్డు వచ్చిందని, ఇప్పడు ఈ సినిమా కలెక్షన్లు అంతకన్నా ఎక్కువ అని ఆయన వెల్లడించారు.

జగన్ పై దొంగదెబ్బే గత్యంతరమా?

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Show comments