బిగ్‌బాస్ లేడీ ఫేంతో రాహుల్... ఏదో ఉందని గుస‌గుస‌!

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-3 విజేత‌, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌లో ... ఓ సామాన్యుడు త‌న విజ‌యాన్నిచూసుకున్నాడు. కులం, ప్రాంతం, మ‌తం, లింగ‌భేదం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ రాహుల్‌ను ఆద‌రించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత ప‌లు షోల‌లో యాంక‌ర్‌గా రాహుల్ క‌నిపించాడు. అలాగే రంగ‌మార్తాండ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించు కున్నాడు.

ఇటీవ‌ల బిజినెస్‌మ్యాన్‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. "ఊకో కాకా" పేరుతో వ‌స్త్ర  వ్యాపారం స్టార్ట్ చేశాడు. త‌న  వ్యాపార దుకాణానికి పెట్టిన పేరును చూస్తే, త‌న తెలంగాణ యాస‌పై రాహుల్ ఎంత‌గా మ‌మ‌కారం పెంచుకున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల కరీంనగర్‌లో  షోరూమ్‌ను ప్రారంభించగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఆ షాపున‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌తో రాహుల్‌లో ఉత్సాహం రెట్టింపైంది. అదే ఊపులో  నేటి సాయంత్రం హైదరాబాద్‌లో కూడా కొత్త షాప్ తెరిచేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు.  ఈ కార్యక్రమానికి ప్ర‌త్యేక అతిథిగా తోటి కంటెస్టెంట్‌, బిగ్‌బాస్ లేడీ ఫేం అషూ రెడ్డి వ‌స్తున్న‌ట్టు  రాహుల్  సోషల్‌ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

ఈ సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో, రాసిన వాక్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

"నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునే వాళ్లే నిజమైన స్నేహితులు.. ఊకో కాకా స్టోర్‌ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు స్వాగతం. మజాక్‌ కాదు, కాకా ఫ్రెండ్‌ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ త‌న‌దైన యాస‌లో, భాష‌లో రాసుకొచ్చాడు. 

ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేయ‌డంతో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫొటోపై నెటిజ‌న్లు, రాహుల్ అభిమానులు ర‌క‌ర‌కాలుగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

"మీది ఫ్రెండ్‌షిప్‌ అంటే ఒప్పుకోం, ఏదో తేడా కొడుతోంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది...సంథింగ్ సంథింగ్"  అంటూ నేరుగానే కామెంట్స్ పెడుతుండ‌డం విశేషం. వీళ్లిద్ద‌రి వాలకం చూస్తుంటే కుచ్‌ కుచ్‌ హోతా హై అనిపిస్తోందని మరికొందరు కామెంట్స్ పెట్టారు. 

ఇంత‌కూ ఈ ఫొటో ఏ సంద‌ర్భంలో తీసుకున్నారో, ఇప్పుడెందుకు షేర్ చేశాడో, పైగా అషూ కంటే స‌న్నిహితులైన కంటెస్టెంట్స్ ఉన్నా .....వాళ్లెవ‌రినీ ఎందుకు పిల‌వ‌లేద‌నే ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ స‌మాధానం ఇవ్వాల్సి ఉంది. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Show comments