భాషకు అవమానం జరిగితే ఊరుకోరు

సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఉత్తరాది నాయకుల ఆధిపత్యంలోనే నడుస్తుంటుంది. ఉత్తరాది నాయకులకు దక్షిణాది అన్నా, ఇక్కడి నాయకులన్న చాలా చిన్న చూపు అనే ప్రచారం ఉంది. ఒక్కోసారి చూస్తే ఇది వాస్తవం అనిపిస్తుంది. 

దక్షిణాదిలో కూడా తమిళనాడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఉత్తరాది నాయకులు. ఆ తరువాత కర్ణాటకకు  ఇంపార్టెన్స్ ఇస్తారు. అత్యంత చిన్న చూపు చూసేది తెలుగువారిని, తెలుగు భాషను. కొన్ని విషయాల్లో తమిళులు, కన్నడిగులు ఉన్నంత స్ట్రిక్టుగా తెలుగువారు ఉండరు. తమకు దక్కాల్సిన గౌరవం దక్కకపోయినా పట్టించుకోరు. 

కేంద్రప్రభుత్వంలో తగిన పదవులు రాకపోయినా లైట్ తీసుకుంటారు. ఏ విషయంలోనూ ఫైట్ చేయరు. కానీ తమిళులు, కన్నడిగులు ఏ విషయంలోనైనా తమకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా, అవమానం జరిగినా బరెస్ట్ అవుతారు. రోడ్లమీదికి వస్తారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే కన్నడ భాషను కేంద్రం గౌరవించలేదని.  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  భద్రావతిలోని మిలటరీ క్యాంపస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ భవనానికి శంకు స్థాపన చేశారు. అయితే ఈ శిలాఫలకంలో ఆంగ్ల భాష, హిందీ భాషలున్నాయి.  

కన్నడ భాష మాత్రం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కుమార స్వామి ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భాషను నిర్లక్ష్యం చేశారని కుమార స్వామి తీవ్రంగా మండిపడ్డారు. భారత్ వైవిధ్యంతో కూడిన దేశమని, త్రిభాషా సూత్రాన్ని అవలంబించడం ద్వారా ఆయా రాష్ట్రాల భాషలను గౌరవించడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర హోంమంత్రి త్రిభాషా సూత్రాన్ని విస్మరించడం కన్నడ భాషకు, ప్రజలకు అగౌరవమని కుమార స్వామి ఆరోపించారు. ఈ సంఘటన ద్వారా కన్నడ ప్రజానీకాన్ని ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భవన్నాన్నికన్నడ భూమిలోనే నెలకొల్పారని, ఈ భవనం కోసం కన్నడీగులు భూదానం చేశారని పేర్కొన్నారు. దీనిపై కచ్చితంగా హోంమంత్రి షా స్పందించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు. 

''కన్నడ భాషను ఎందుకు విస్మరించారో షా సమాధానం చెప్పి తీరాలి. భూమిని, భాషను రక్షించలేని వారికి పాలించే అధికారమే లేదు. కన్నడీగుల విషయంలో అమిత్‌షా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు.'' అంటూ కుమార స్వామి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు.

కుమారస్వామికి బీజేపీ అంటే పడదు కాబట్టి ఇలాంటి విమర్శలు చేశారనుకోవద్దు. బీజేపీతో దోస్తీ ఉన్నా ఇలాగే స్పందించేవాడు. వాళ్ళ భాషాభిమానం అటువంటిది. ఇదే విషయంలో తెలుగోళ్లయితే గమ్మున ఉండిపోతారు. 

తమిళ, కన్నడిగుల భాషాభిమానం ఒక్కోసారి ఓవర్ గా అనిపించవచ్చుగాని ఆ మాత్రం కూడా నిరసన తెలియచేయకపోతే ఉత్తరాదివారు చెవులకు పిడకలు కడతారు. తమిళనాడు నాయకులు భాష విషయంలో కేంద్రాన్ని ఎదిరిస్తారు కాబట్టే వారంటే అక్కడి ప్రజలకు అభిమానం. అందుకే అక్కడ జాతీయ పార్టీలు మనుగడ సాగించలేకపోతున్నాయి. 

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments