ప్రభాస్ ఖాతాలో మరో హాట్ బాలీవుడ్ బ్యూటీ?

ఇకపై ప్రభాస్ చేసే సినిమాల్లో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీ కనిపించాల్సిందే. సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ ఉండాలంటే అందులో బాలీవుడ్ భామ ఉండాల్సిందే అనే కండిషన్ ఆటోమేటిగ్గా చేరిపోయినట్టుంది. 

ఇందులో భాగంగా ప్రభాస్ తాజాగా ప్రారంభించిన సలార్ కోసం కూడా ఓ బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. సలార్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను తీసుకోబోతున్నారు. త్వరలోనే ఆమె పేరును ప్రకటిస్తారు. 

కత్రినాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను సలార్ కోసం వాడుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు సలార్ లో విలన్ పాత్ర కోసం ఇప్పటికే జాన్ అబ్రహాంను సంప్రదించారు.

సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్-ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోన్ ను హీరోయిన్ గా లాక్ చేశారు. 

ఇదే ఊపులో సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని సమాచారం. కత్రినాకు టాలీవుడ్ హీరోలు కొత్తకాదు. వెంకటేష్, బాలకృష్ణ సరసన ఆమె సినిమాలు చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు పరిమితమైపోయింది. 

మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్  మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతోందన్నమాట. అయితే కత్రినాకైఫ్ టాలీవుడ్ రీఎంట్రీ అంటూ గతంలో చాలా కథనాలు వచ్చాయి. ఇది కూడా అలా ఓ గాసిప్ గా మిగిలిపోతుందా లేక నిజమౌతుందా అనేది చూడాలి.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments