రోజా, రామ్‌చ‌ర‌ణ్ ఇష్ట‌ప‌డే హీరో ఎవ‌రంటే...

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా, యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ ...ఈ ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డే హీరో ఒక్క‌రే. ఇంత‌కూ ఆ హీరో ఎవ‌రో తెలుసా? ప‌్ర‌త్యేకంగా మెగాస్టార్ ఇంట్లో చాలా మంది హీరోలున్న‌ప్ప‌టికీ... వారెవ‌రినీ కాద‌ని, మ‌రొక‌రిని రామ్‌చ‌ర‌ణ్ ఇష్ట‌ప‌డ‌డం ఆస‌క్తిక‌ర‌మే. 

ఇంత‌కూ ఆ హీరో ఎవ‌రో తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతోంది క‌దూ! ఆ వివ‌రాలు తెలుసుకుందాం. రోజా , రామ్‌చ‌ర‌ణ్ ఇష్ట‌ప‌డే ఆ మాస్ హీరో ర‌వితేజ.  

క‌నీసం ఒక్కటంటే ఒక్క‌ సినిమాలో కూడా ఆయన స‌ర‌స‌న నటించకుండానే ర‌వితేజ అంటే  పిచ్చి అభిమానం అని రోజా చెబుతున్నారు. అయితే రోజా సినిమాలో ర‌వితేజ స‌పోర్టింగ్ రోల్ చేయ‌డం గ‌మనార్హం.  

రోజా, ర‌వితేజ కలిసి శంభో శివ శంభో, తిరుమల తిరుపతి వెంకటేశ, వీర సినిమాల్లో నటించారు. రవితేజ  నటించిన‌ ప్రతీ సినిమాను వదలకుండా చూస్తానని.. ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాలేదని ఇటీవ‌ల ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రోజా చెప్పారు. 

మ‌రీ ముఖ్యంగా ర‌వితేజ కామెడీని ఎంజాయ్ చేస్తాన‌ని రోజా అభిప్రాయ‌ప‌డ‌డం విశేషం. తాజాగా విడుద‌లైన క్రాక్ సినిమాను తెగ ఎంజాయ్ చేసిన‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు.  

ఇక ర‌వితేజ‌ను అభిమానించే సినీ సెల‌బ్రిటీల జాబితాలో యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ చేరాడు. తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను ఫుల్   ఎంజాయ్ చేసానని రామ్‌ రివ్యూ కూడా ఇచ్చాడు.  క్రాక్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ కు కూడా రామ్ ఫోన్ చేసి అభినందించాడు.  

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments