క్ష‌మించండి..నా చ‌ర్య‌కు చింతిస్తున్నాః ప్ర‌ముఖ హీరో

ప్ర‌ముఖ త‌మిళ హీరో త‌న పుట్టిన రోజు నాడు క్ష‌మాప‌ణ‌లు కోరాల్సి వ‌చ్చింది. నెటిజ‌న్ల దెబ్బ‌కు ఆయ‌న దిగి రావాల్సి వ‌చ్చింది. ఒక ప‌ని చేసే ముందు, ఎంతో ఆలోచించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఇది తెలియ‌జేస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి నేడు త‌న పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పొన్రామ్ త‌న టీంతో క‌లిసి  బ‌ర్త్‌డే కేక్‌ను తీసుకొచ్చారు. కొంచెం భిన్న‌త్వం కోసం కేక్‌ను విజ‌య్ చేతుల మీదుగా క‌త్తితో క‌ట్ చేయించారు. ఇలా చేయ‌డం వివాదానికి దారి తీసింది. క‌త్తితో కేక్ చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం, వాటిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. హింస‌ను ప్రేరేపించేలా ఉందంటూ నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

దీంతో విజ‌య్ సేతుప‌తి ఎట్ట‌కేల‌కు నెటిజ‌న్లు, అభిమానుల ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకుని ఒక మెట్టు కిందికి దిగారు. త‌న‌పై జ‌రుగుతున్న ట్రోల్‌పై ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.

‘నా  పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వివాదాస్పదమ‌వుతుంది.  ఇందులో నేను కత్తితో కేట్‌ కట్‌ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాంతో కేక్‌ కట్‌ చేయడానికి కత్తిని ఉపయోగించాను. 

ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతి స్తున్నాను’ అంటూ విజయ్‌ సేతుపతి తమిళ్‌లో ట్వీట్‌ చేశారు. 

విజ‌య్ త‌ప్పొప్పుల సంగ‌తి ప‌క్క‌న పెడితే, అత‌ను ప్ర‌ద‌ర్శించిన విజ్ఞ‌త స‌దా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Show comments