సమంత హ్యాండ్ బ్యాగ్ రేటు ఎంతో తెలుసా?

లేటెస్ట్ డిజైన్స్, ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటుంది సమంత. కొన్ని సందర్భాల్లో ఆమె వేసుకున్న దుస్తులు ట్రెండ్ సెట్ చేస్తుంటాయి కూడా. అలా ఈ చలికాలంలో సమంత వేసుకున్న ఓ డ్రెస్ సరికొత్త స్టయిల్ స్టేట్ మెంట్ గా మారింది. మరీ ముఖ్యంగా ఆమె పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

ది ఫ్యామిలీ మేన్ సీజన్-2 ప్రచారం కోసం ముంబయి వెళ్లింది సమంత. అక్కడ ఎయిర్ పోర్టులో సమంత క్లిక్స్ వైరల్ అయ్యాయి. పసుపు రంగు డ్రెస్ పై ఆమె వేసుకున్న డెనిమ్ కోటు యూత్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. సమంత పట్టుకున్న హ్యాండ్ బ్యాక్ మరో ఎత్తు.

లూయీజ్ ఉటాన్ బ్రాండ్ కు చెందిన ఈ మోనోగ్రామ్ కాన్వాస్ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 2 లక్షల రూపాయలు. ప్రస్తుతం ఈ బ్యాగ్ పై సోషల్ మీడియాలో ఆరాలు ఎక్కువయ్యాయి. దీంతో పాటు ఈమధ్య భర్తతో కలిసి సమంత మాల్టీవులు టూర్ కు వెళ్లింది. ఆ టైమ్ లో ఆమె క్యారీ చేసిన యాక్ససిరీస్ కూడా ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ అవుతున్నాయి. 

లాక్ డౌన్ టైమ్ లో శామ్-జామ్ అంటూ ఓ టాక్ షో చేసిన సమంత.. రీసెంట్ గా దాన్ని పూర్తిచేసింది. త్వరలోనే ఆమె శాకుంతలం సినిమా సెట్స్ పై జాయిన్ అవ్వబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత ఓకే చేసిన సినిమా ఇది. 

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

Show comments