తెరాస ట్రాప్ లో భాజపా?

రాజకీయ చదరంగంలో మన ఎత్తులు మాత్రమే కీలకం కాదు. ఎదుటవాళ్ల ఎత్తులను ప్రభావితం చేయడం కూడా కీలకమే. జిహెచ్ఎంపి ఎన్నికల నేపథ్యంలో భాజపా స్ట్రాటజీని ప్రభావితం చేయడంలో తెరాస పక్కా సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. 

హైదరాబాద్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ గణనీయంగా వుండడం, అదే సమయంలో ప్రశాంత వాతావరణం ఎక్కడ భగ్నమవుతుందో అన్న భయం హైదరాబాదీల్లో వుండడంతో, ఆ దిశగా తెరాస విమర్శలు చేస్తూ, భాజపాను టార్గెట్ చేయడం ప్రారంభించింది. 

నిజానికి దీన్ని తిప్పి కొడుతూ, తమపై అనవసరపు బురదవేస్తున్నారనే దిశగా భాజపా వెళ్లాల్సి వుంది. కానీ ఎందుకో, ఎక్కడో తేడా వచ్చింది.తెరాస అనుకున్న దిశగా భాజపా ప్రయాణం ప్రారంభించేసింది. పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రయిక్ అనే దారుణ పదజాలంతో కూడిన స్టేట్ మెంట్ ను భాజపా నేతలు వాడేసారు. ఇది నిజంగా సెల్ఫ్ గోల్ అనుకోవాలి. 

ఇలా అనడం ద్వారా హిందూ ఓటు గంపగుత్తగా తమకు వచ్చేస్తుంది అనుకోవడం భ్రమే. ఎందుకంటే హైదరాబాద్ జనాలు దశాబ్దాల కాలంగా ఫ్రశాంతంగా వున్నారు. ఇప్పుడు ఆ ప్రశాంతత భగ్నం అయిపోతుంది అంటే భరించలేదు. 

భాజపా వచ్చి, నానా రగడ చేస్తుంది అంటే ఎలా ఒప్పుకుంటారు. పైగా ఎమ్ఐఎమ్ మీద కాస్తో కూస్తో పాతబస్తీలో వ్యతిరేకత వుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు భాజపా మళ్లీ పాతబస్తీ జనాలు ఎమ్ఐఎమ్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. ఇప్పుడు ఏమయింది. భాజపా స్టేట్ మెంట్ పట్టుకుని తెరాస మరింత యాగీ చేస్తోంది. తాము ముందే చెప్పాం కదా? అంటోంది. 

ఇక కాలు వెనక్కు తీసుకోలేక భాజపా అదే దిశగా మరిన్ని స్టేట్ మెంట్ లు ఇస్తోంది. ఆ విధంగా భాజపా వ్యూహాలను తనకు అనుకూలంగా తిప్పుతున్నట్లు కనిపిస్తోంది తెరాస.

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments