భావనపాడుకు సింగరేణికి భలే లింక్ పడిందే ?

ఉత్తరాంధ్రా జిల్లాల్లో అత్యంత వెనకబాటుతనంతో మగ్గిపోయిన జిల్లా శ్రీకాకుళం. ఇక్కడ జనాలు వలసలతోనే బతుకులు తెల్లారుస్తారు. దుబాయ్, కువైట్ ఇలా ప్రవాసాన్ని పట్టుకుని జీవితాలను ముగించేస్తారు.

వీరికి దశాబ్దాల కల భావనపాడు పోర్టు నిర్మాణం. గత పాలకులు కేవలం మాటలకే పరిమితమైతే నోటితోనే బూరెలు వండారు, జగన్ పాదయాత్ర సమయంలో భావనపాడు పోర్ట్ పూర్తి చేస్తాను అని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇపుడు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.

పాలనాపరమైన ఉత్తర్వులు కొన్ని నెలల కిందటే మంజూర్ అయ్యాయి. నిధుల విషయంలోనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు భూసేకరణ కోసం సమాయత్తమవుతున్న వేళ ఇపుడు సింగరేణి రూపంలో అతి పెద్ద అడ్డంకి వచ్చిపడింది.

అప్పట్లో ఉమ్మడి ఏపీలో సింగరేణి కర్మాగారం కోసం అక్కడ ఉన్న అటవీ భూమిని సేకరించారు. భూమికి భూమి నష్టపరిహారం అన్న లెక్కన శ్రీకాకుళంలోని మూలపేటలో 825 ఎకరాల భూమిని నాడు ఉమ్మడి ఏపీ  ప్రభుత్వం అటవీశాఖకు బదులుగా ఇచ్చింది.

ఇపుడు ఈ భూమిని భావనపాడు పోర్టు కోసం సేకరిస్తున్న వేళ ఈ సంగతి బయటపడడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ భూమి కావడంతో కేంద్ర అనుమతులు తప్పనిసరి, అలాగే పర్యావరణ అనుమతులు కూడా కావాలిట.

దాంతో పాటు ఇంతకు ఇంతా భూమిని వేరే చోట అటవీ శాఖకు చూపించి కానీ ఈ సేకరణ చేపట్టడానికి వీలు లేదు అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే భావనపాడు పోర్ట్ కల నెరవేరుంది అనుకుంటున్న టైం కి సింగరేణి రూపంలో అతి పెద్ద అడ్డంకి వచ్చిపడిందని అంటున్నారు.

మరి ఈ అనుమతులు కేంద్రం మంజూర్ చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన అధికార యాంత్రాంగమే కాదు, రాష్ట్ర ప్రభుత్వమూ కదలాల్సి ఉంటుంది.

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments