ఎంపీ వేరు ఎమ్మెల్యే వేరు పవన్

ఎమ్మెల్యే అంటే మహా అయితే మూడు నాలుగు మండలాల ఓటర్లు వుంటారు. కానీ ఎంపీ అంటే అలా కాదు పాతిక మండలాల వరకు ఓటర్లు వుంటారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లుగా వుంది జనసేన అధిపతి పవన కళ్యాణ్ వ్యవహారం. 

తిరుపతి ఎమ్మెల్యేలా మా అన్న మెగాస్టార్ గెలిచారు, అక్కడ మా సామాజిక వర్గం ఫుల్ గా వుంది..అందుకే మాకు ఆ సీటు వదిలేయండి..అంటూ భాజపాను వేడుకుంటున్నారంటూ వార్తలు వినవస్తున్నాయి. 

అయితే తిరుపతి ఎంపీ సీటు చిరకాలంగా ఎక్కువసార్లు కాంగ్రెస్ చేతిలో వుంటూ వస్తోంది తప్ప తెలుగుదేశానికి అందిందే అతి తక్కువ సార్లు. ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు అధికంగా వున్న ఎంపీ సీటు అది. 

పోనీ జనానికి జగన్ మీద మొహం మొత్తేసింది, అందువల్ల యాటీ ఓట్ వుంటుంది అని అనేసుకున్నా, అది అందుకోవడానికి తెలుగుదేశం రెడీగా వుంది.

తెలుగుదేశాన్ని కాదని జనసేనను దగ్గరకు తీయాలంటే అంతకు అంతా పటిష్టమైన పార్టీ యంత్రాంగం వుండాలి. పవన్ చరిష్మా ఒక్కటే చాలదు. ఆ సంగతి పవన్ రెండు చోట్ల ఓడిపోయినపుడే అర్థం అయిపోయింది.

ఎమ్మెల్యేగా గెలవలేని పార్టీ నేత ఎంపీ సీటు అడగడం విడ్డూరంగా వుంది. జనసేన పోటీ చేయడం ద్వారా అక్కడ నెగిటివ్ ఓటును చీల్చడం తప్ప సాధించేది మరేమీ వుండకపోవచ్చు.

లేదా మొన్నటి 2019 ఎన్నికల్లో మాదిరిగానే తెలుగుదేశంతో తెరవెనుక పొత్తు, సహకారం అందిస్తే మరీ ప్రమాదం. అది ఆ పార్టీకే హాని చేస్తుంది. 

ఓకే ఓక్కసారి గెలిచిన తెలుగుదేశం, అసలు ఎంపీ సీటు అంటే తెలియన జనసేన బరిలో వుంటే వైకాపా పరిస్థితి ఎలావుంటుందో మరి. చూడాలి.

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?

Show comments