విశ్వ‌దాభిరామ...వినుర నిమ్మ‌గ‌డ్డ సూక్తులు

ఎప్పుడో చెప్పిన వేమ‌న గారి నీతి సూక్తుల గురించే ఇంకా మ‌నం మ‌న‌నం చేసుకుంటూ త‌న్మ‌య‌త్వం చెందుతున్నాం. అదేంటోగానీ, మ‌న క‌ళ్లెదుట ఉన్న గొప్ప‌గొప్ప వాళ్ల‌ను అస‌లు గుర్తించ‌లేం. 

ఎప్పుడో 1652-1730 మ‌ధ్య కాలంలో జీవించిన సామాజిక, సాంస్కృతిక చైత‌న్య‌కారుడైన‌ వేమ‌న అలా చెప్పారు, ఇలా చెప్పార‌ని గుర్తు చేసుకుంటూ సాంత్వ‌న పొందుతుంటాం. ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య స‌జీవ సాక్ష్యంగా న‌డియాడుతున్న మ‌న‌కాల‌పు గొప్ప నీతిమంతుడు, నిజాయ‌తీకి మ‌రోపేరైన నిమ్మ‌గ‌డ్డ వారి నీతిసూత్రాలు మాత్రం రుచించ‌వా? ఇదెక్క‌డి అన్యాయం?

అవున్లే ఆయ‌న గొప్ప‌త‌నాన్ని అంగీక‌రించ‌డానికి మ‌నిషికి స‌హ‌జంగా ఉండే ఈర్ష్య‌, అసూయ‌లే కార‌ణం కాదా? ప‌ంచాయ‌తీ ఎన్నిక‌లను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించాల‌ని ఆయ‌న అనుకోవ‌డం, దానిపై ప్ర‌భుత్వం సానుకూలంగా లేని నేప‌థ్యంలో న‌డుస్తున్న లేఖ‌ల ప‌రంప‌ర‌లో కొన్ని ఆణిముత్యాల్లాంటి నీతిసూత్రాలు ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. వాటి గురించి తెలుసుకుని త‌రిద్దాం.

*ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదన్న భ్రమల్లో ఉంటే తొలగించుకోండి.

*ఎన్నికల తేదీలను మీరు చెప్పాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలనడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధం.

* మీరు చెప్పిందే జరగాలన్న, జరుగుతుందన్న భ్రమలో ఉండటం సరికాదు.

*ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదే. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలే తప్ప సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకు విరుద్ధంగా వక్రభాష్యం చెప్పడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.

*ఎన్నికల తేదీలు ఎవరు నిర్ణయించాలన్న విషయంలోనూ మీకు సందేహం ఉంటే కోర్టునే అడగండి. అంతే తప్ప మీకు తోచినట్లుగా వక్రభాష్యం చెప్పడం నేరం.

*క‌లెక్ట‌ర్ల‌తో నేను వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌కుండా అడ్డుకోవ‌డం రాజ్యాంగంతో పాటు చ‌ట్ట విరుద్ధం.

*ప్రభుత్వం తన  సొంత‌, సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు ప్రేరేపించడం అనైతికం, అన్యాయం, అక్ర‌మం...ఎక్సెట్రా.
 
వింటే మ‌హాభార‌తమే వినాల‌నేది నాటి మాట‌. కానీ వింటే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ సూక్తులే వినాలనేది నేటి మాట‌. జ‌నం శ్రేయ‌స్సు రీత్యా ప్ర‌తిరోజూ ఆయ‌న చీఫ్ సెక్ర‌ట‌రీకో, గ‌వ‌ర్న‌ర్‌కో, లేక కేంద్ర‌హోంశాఖ కార్య‌ద‌ర్శికో లేఖ‌లు రాస్తూ ఉంటారు. 

త‌న అద్భుత సృజ‌నాత్మ‌క‌త‌తో జీవితాన్ని మ‌దించి, శోధించి రాసే జీవిత స‌త్యాలు ఇప్ప‌టి త‌రానికే కాదు, రాబోవు త‌రాల వారికి కూడా ఎంతో ప్ర‌యోజ‌న‌కారిగా ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న్ను గొప్ప  ప్ర‌వ‌చ‌న‌కారుడిగా తీర్చిదిద్దిన ఘ‌న‌త జ‌గ‌న్ స‌ర్కార్‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు

Show comments