అక్రమార్కుల గుండెల్లో గుబులు

దాదాపు మూడు దశాబ్దాలుగా తమ సామాజిక ప్రభుత్వం అండతో ఉత్తరాంధ్ర మొత్తాన్ని ముఖ్యంగా విశాఖను రాజకీయంగా, వ్యాపారపరంగా కబళిస్తూ వచ్చింది ఓ సామాజిక వర్గం. వ్యాపారాలు వారివే. ఆస్థులు వారివే. పదవులు వారివే. 

ఉత్తరాంధ్ర జనాలు అమాయకంగా వాళ్ల దగ్గర పని చేసుకుని బతకడమే. ఏ ఒకరిద్దరైనా ఈ దోపిడీని నిలదీసే ప్రయత్నం, ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదు ఎందుకంటే మీడియా కూడా వాళ్లదే కదా? ఎవరు కవర్ చేస్తారు. ఇలా సాగుతూ వచ్చింది ఇన్నాళ్లు.

రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫిష్షింగ్, కనస్ట్రక్షన్, కాంట్రాక్టులు, హోటల్, రాజకీయం ఇలా ఒకటి కాదు రెండుకాదు సమస్త రంగాల్లో పాతుకుపోయారు. పొరపాటున ఎవరైనా రావడం భయం, ఏధో విధంగా వాళ్లను సాగనంపడమే. 

సుబ్బరామిరెడ్డి ఎంపీగా వుంటుంటే, కాంగ్రెస్ లోకి పురంధ్రీశ్వరి వచ్చారు. ఆ విధంగా సుబ్బరామిరెడ్డిని పక్కన పెట్టారు. విజయమ్మ పోటీ చేయబోతే, అదిగో కడప గూండాలు, ఇదిగో పులివెందుల రౌడీలు అంటూ నానా చెత్త ప్రచారం చేసేసి పక్కన పడేలా చేసారు. 

ఇప్పుడు ఇన్నాళ్లకు సరైన మగాడు, మొగుడు అన్నట్లుగా జగన్ సిఎమ్ గా వచ్చారు. విశాఖ అక్రమాలను ఓ చూపు చూస్తున్నారు. డబ్బులు సంపాదించడం ఇంత సింపుల్ అనేలా అడ్డదారిలో సంపాదిస్తున్నవారిని ఓ చూపుచూస్తునారు. 

వడ్డించే ప్రభుత్వం మనది అయితే చాలు, మాంచి సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని లీజు తీసుకోవడం, దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, ప్రాజెక్టు రిపోర్ట్ సబ్ మిట్ చేసి, లోన్ తెచ్చుకోవడం, ఏదో ఒకటి కట్టి అద్దెకు ఇచ్చి, ఆ డబ్బుల్లోంచే ఈ వాయిదా కట్టడం, పైగా లోన్ తెచ్చిన దాంట్లో కొంత వెనకేయడం. ఇలాంటి వ్యవహారాలే ఎక్కువ. 

ఇప్పుడు విశాఖపై ప్రభుత్వం ఉక్కుపాదం వేసి ఈ అక్రమార్కులను అణచివేస్తోంది. దీంతో ఇలాంటి వ్యవహారాలు చేసిన చాలా మంది కిందా మీదా టెన్షన్ పడుతున్నారు. కార్పొరేషన్ స్థలాన్ని తమ పార్లర్ కు పార్కింగ్ గా మార్చేసిన వాళ్లు, దస్ పల్లా హిల్స్ లో గెడ్డలను ఆక్రమించి బిల్డింగ్ లు కట్టేసిన వాళ్లు, ఇలా చాలా మంది కిందా మీదా అవుతున్నారు. 

వైజాగ్ లో ఓ పెద్ద హోటల్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా వున్నాయి. వారు చాలా చోట్ల కట్టిన వాటిలో ఇలాంటి ఆక్రమణలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటి వివరాలు అన్నీ సేకరిస్తున్నారని తెలుస్తోంది.

మొత్తం మీద లీగల్ సమస్యలు రాకుండా వుంటే విశాఖను సిఎమ్ జగన్ ప్రక్షాళన చేసేలాగే వున్నారు. 

రాజ్యాంగం విఫలం అయిందనడం ధర్మమేనా? 

Show comments