బన్నీని చూసిన కళ్లతో బాలయ్యను

హీరో బాలకృష్ణ ది చిత్రమైన వ్యవహారం. ఆయనకు నప్పేవి కాకుండా ఆయనకు నచ్చేవి చేయడం ఆయన నైజం. కథనాయకుడు అంటూ రకరకాల వేషాలు వేసేసారు. లేటెస్ట్ గా ఆయన గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ను చేయబోతున్నారని వార్తలు వచ్చేసాయి.

మొన్నటికి మొన్న విడుదల చేసిన నర్తనశాల అనే 16 నిమషాల బుచ్చి సినిమాను చిత్రీ  పట్టి, అతుకులు వేయడంలో సాయం చేసిన ఓ డైరక్టర్ అసిస్టెంట్ టీమ్ కు గోనగన్నారెడ్డి సినిమా స్క్రిప్ట్ తయారుచేసే బాధ్యతను బాలయ్య అప్పగించారట.

ఇప్పుడు ఆ టీమ్ గుణశేఖర్ లెవెల్ లో వరంగల్ ప్రాంతాల్లో తిరిగి, గోనగన్నారెడ్డి కథ కోసం రీసెర్చి చేయడం వంటి వ్యవహారాలు స్టార్ట్ చేసిందట. గోనగన్నారెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవడం సంగతి పక్కన పెడితే, ఆ పాత్ర అంటే చాలు నల్లటి డిజైనర్ డ్రెస్ తో, రుద్రమదేవి సినిమాలో తళక్కున మెరిసిన బన్నీ గుర్తుకు వస్తాడు. 

మిడ్ ఏజ్డ్ లో వున్న బన్నీ లుక్ ఎలా వుంటుంది? రిటైర్ మెంట్ ఏజ్ దాటేసిన బాలయ్య లుక్ ఎలా వుంటుంది? ప్రేక్షకులు ఎలా రీసీవ్ చేసుకుంటారు? బాలయ్య తన ఎన్ బి కే బ్యానర్ మీద నిర్మిస్తే ఫరవాలేదు. ఎలాగూ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు గుల్లయిపోయారు.

కానీ బాలయ్య ఓకెనే. అందువల్ల ఇప్పుడు కూడా ఆయనే నిర్మిస్తే బెటరేమో? జనం బన్నీని చూసిన కళ్లతో బాలయ్యను కూడా చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద లాభం నష్టం ఆధారపడి వుంటాయి.

ఇది టీడీపీ కాదు కరణం గారూ

Show comments