సుకుమార్ కు భారీ అడ్వాన్స్?

చేతిలో సినిమా ఇంకా మొదలు కానే లేదు. మరో ఏడాదిన్నర తరువాత చేయబోయే సినిమాను అనౌన్స్ చేసారు దర్శకుడు సుకుమార్. దీనికి నిర్మాత కేదార్. హీరో బన్నీకి అత్యంత సన్నిహితుడు, కొన్ని వ్యాపారాల్లో భాగస్వామి కూడా. నిజానికి కేదార్ కు బన్నీతో సినిమా తీయాలని వుందని చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. కానీ ఇప్పడు చటుక్కున వేరే హీరోతో సినిమా ప్రకటించారు. అది కూడా 2022 నాటికి. 

అయితే ఇందుకోసం దర్శకుడు సుకుమార్ కు భారీ అడ్వాన్స్ ముట్టచెప్పినట్లు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎంత అడ్వాన్స్ ఇచ్చారన్నదాని మీద రకరకాల అంకెలు వినిపిస్తున్నాయి. సుమారు 10 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని, అలాగే ఇదే సినిమా కోసం మరో అయిదు కోట్ల వరకు అడ్వాన్స్ ల కింద ఖర్చు చేసారని టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

అంటే మరో ఏడాదిన్నర తరువాత తీయబోయే సినిమా కోసం 15 కోట్లు ఇప్పుడే ఖర్చు చేసారన్నమాట. నిజానికి కరోనా నేపథ్యంలో 2021లో మార్కెట్ ఎలా వుంటుందో తెలియక దాదాపు టాలీవుడ్ లోని పాపులర్ బ్యానర్లు అన్నీ సెట్ చేసుకున్న ప్రాజెక్టులు అన్నీ అలా వుంచాయి.

2021 తరువాత కానీ మార్కెట్ మీద ఓ క్లారిటీ రాదని అప్పుడే ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఓ కొత్త నిర్మాత ఇంత భారీగా రంగంలోకి దిగడం టాలీవుడ్ సర్కిళ్లో కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

జగన్ ను కొట్టాలంటే మరో వ్యూహం లేదా?

Show comments