అశోక్ సేవలు అవసరం లేదా..?

విజయనగరం జిల్లా పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూసపాటి వారి ఫ్యామిలీ. శతాబ్దాల  చరిత్ర వారి సొంతం. ఈ దేశానికి స్వాతంత్రం రాక‌ ముందు సంస్థానాలను ఏర్పాటు చేసుకుని ఆయా ప్రాంతాలను చల్లగా పాలించిన చరిత్ర వారిది.

స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజలు వారిని దీవించారు. మీరే మా ఏలికలు అంటూ పీవీజీ రాజు నుంచి అశోక్ గజపతిరాజు వరకూ గెలిపించారు. పలుమార్లు రాష్త్ర మంత్రిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు. చంద్రబాబు కంటే కూడా సీనియర్ అని చెప్పాలి.

అటువంటి రాజు, ఆయన కుమార్తె అతిధి గజపతిరాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్ ప్రభంజనంలో లోకేష్ లాంటి వారే ఓడాక ఎవరు ఓడారు అన్నది ఇక్కడ  చర్చ కాకూడదు. ఇక  అశోక్ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతి రాజు నాటి నుంచి జిల్లా టీడీపీ రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు.

ఆమెని పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రెసిడెంట్ చేస్తారని రాజు గారి అభిమానులంతా ఆశించారు. కానీ అనూహ్యంగా రాజకీయ సమీకరణ కోసం కళా వెంకటరావు తమ్ముడు కొడుక్కి పదవి ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. వారసులకు తావు లేదంటూ ఒక వారసుడికి పదవి ఇచ్చారని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి అశోక్ చేసిన సేవలకు ఇదా బహుమతి అన్న మాట కూడా వినిపిస్తోందిట.

జగన్ ను కొట్టాలంటే మరో వ్యూహం లేదా?

హర్షకుమార్ టీడీపీలో చేరడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు

Show comments