పూరిపై ఛార్మి ఫీలింగ్ ఇది

పూరి జగన్నాధ్-ఛార్మి.. వీళ్లిద్దర్నీ విడదీసి చూడలేం. జ్యోతిలక్ష్మి అనే సినిమా నుంచి కలిసిన ఈ జోడీ.. అప్పట్నుంచి ఇప్పటివరకు తమ "ప్రొఫెషనల్" ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా, వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చెలరేగినా.. చార్మి మాత్రం ఎప్పుడూ తన పార్టనర్ ను వీడలేదు. అతడితోనే కెరీర్ బండి లాగిస్తోంది.

అవకాశం చిక్కినప్పుడల్లా పూరిపై తన అభిమానాన్ని ప్రదర్శించే ఛార్మికి, ఈరోజు కూడా అలాంటి అవకాశం వచ్చింది. ఈరోజు పూరి జగన్నాధ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన పూరిపై అంతే అభిమానాన్ని కురిపిస్తూ శుభాకాంక్షలు అందించింది చార్మి.

పూరిని తన గార్డియన్ గా, బెస్ట్ ఫ్రెండ్ గా, మోస్ట్ కేరింగ్ పర్సన్ గా, బెస్ట్ బిజినెస్ పార్టనర్ గా చెప్పుకొచ్చిన చార్మి.. అతడికి మనసారా శుభాకాంక్షలు అందించింది. అంతేకాదు.. ఈ సందర్భంగా పూరికి ఓ వాగ్దానం కూడా చేసింది ఈ బ్యూటీ. పూరి గర్వపడేలా ఉంటానని చెబుతోంది.

ఈరోజు చాలామంది ఈ దర్శకుడికి శుభాకాంక్షలు చెప్పారు కానీ ఛార్మి విశెష్ మాత్రమే వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది మరి. ఫెవికాల్ కంటే దృఢమైనది. 

వైఎస్‌ఆర్‌ జలకళ

Show comments