సోనూ సూద్ కు 'అల్లుడు' సత్కారం

కోరోనా టైమ్ లో దేశం మొత్తం మీద వినిపించింది సోనూ సూద్ పేరు. కరోనా బాధితులకు సాయం చేయడం అన్ని విధాలా ముందు వుండడంతో సోనూసూద్ పేరు మార్కోగింది. ఎక్కువగా పొడడ్తలు, అప్పుడప్పుడు విమర్శలు కూడా వినిపించాయి. మొత్తానికి విలన్ వేషాలు వేసే సోనూసూద్  ఆ విధంగా హీరో అయిపోయాడు. 

పోస్ట్ కరోనా నేపథ్యంలో మళ్లీ షూటింగ్ లు ప్రారంభం కావడంతో సోనూ సూద్ హైదరాబాద్ వచ్చారు. ఫిలిం సిటీలో జరిగే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా టాకీ అయిదు రోజులు, రెండు మూడు పాటలు బకాయి వున్నాయి. షూటింగ్ కు వచ్చిన సోనూసూద్ కు మరో విలక్షణ నటులు ప్రకాష్ రాజ్ సాదరంగా స్వాగతం పలికి, శాలువా కప్పి, బొకే అందించి అభినందించారు. యూనిట్ కూడా సోనూ సూద్ ను సత్కరించింది.

ఈవారంలో టాకీ ఫినిష్ చేసుకుని, పాటల మీదకు వెళ్లే ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీప్రసాద్. నిర్మాత సుబ్రహ్మణం. నభానటేష్, అనుఇమ్మాన్యుయేల్ కథానాయకలు.

వైఎస్‌ఆర్‌ జలకళ

Show comments