పవన్ జాబితాలో ఇంకో సినిమా

మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని సామెత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల జాబితా ఇలాగే వుంది. రీ ఎంట్రీ తరువాత చేస్తున్న వకీల్ సాబ్ పూర్తి కాలేదు. వారం రోజులు షెడ్యూలు చేసిన క్రిష్ సినిమా అలాగే వుంది.

జమానా కాలం నాటి అడ్వాన్స్ తో మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ సినిమా వుండనే వుంది. జనసేనకు సేవలందించిన రామ్ తాళ్లూరి కోసం చేయాల్సిన సురేందర్ రెడ్డి సినిమా సరేసరి. ఇవన్నీ కాక అప్పడప్పుడు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ అంటూ గ్యాసిప్ లు.

ఇవన్నీ ఇలా వుంటే గబ్బర్ సింగ్, తీన్ మార్ సినిమాల నిర్మాత బండ్ల గణేష్ కు కూడా పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపేసారు. సినిమాకు అభయం ఇచ్చేసారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ నే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తన దేవుడుకు తనను కరుణించాడని ఫుల్ హ్యాపీగా వున్నాడు బండ్ల గణేష్.

అంతా బాగానే వుంది. ఇంతకీ పవన్ సినిమాల లైన్లో ఇది ఎన్నో సినిమా అవుతుంది అన్నది తెలియదు. పైగా డైరక్టర్లు ఎవ్వరూ అందుబాటులో లేరు. ఇప్పుడు గణేష్ కు దొరికే డైరక్టర్ ఎవరయి వుంటారో?  పవన్ చాన్స్ ఇస్తానంటే చేయడానికి చాలా మందే వుంటారు. కానీ ప్రస్తుతం ఖాళీగా వున్నవారు కానీ, ఖాళీ చేసుకునే వీలున్నవారు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. 

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

Show comments