ఈసారి లోకేష్ ఏం చేస్తాడో చూద్దాం

గతేడాది సరిగ్గా ఇదే టైమ్ లో నారా లోకేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పట్లో నారా వారబ్బాయ్ చేసిన కామెడీని ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకున్న తర్వాత.. అసలు మేటర్ లోకి వెళ్దాం..

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు తెప్పించడం కోసం.. వైసీపీ నేతలు బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవ పెట్టారట. ఆ పడవ సాయంతో వరదను దారి మళ్లించి చంద్రబాబు నివశిస్తున్న ఇంటివైపు పంపించారట. ఫలితంగా చంద్రబాబు ఇల్లు వరదలో మునిగిపోయిందట. గతేడాది వరదల సమయంలో లోకేష్ చేసిన కామెడీ ఇది. చినబాబు చావు తెలివితేటలకు అప్పట్లో అంతా తెగ నవ్వుకున్నారు.

మళ్లీ ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కృష్ణాకు మరోసారి వరదలొచ్చాయి. ఇంకా చెప్పాలంటే గతేడాది కంటే కాస్త ఎక్కువగానే వరద ఉధృతి ఉంది. అంతేకాదు.. ఈసారి కూడా ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు నివాసంతో పాటు కరకట్టపై ఉన్న మరికొన్ని నివాసాలకు అధికారులు నోటీసులిచ్చారు.

సో.. ఈసారి లోకేష్ ఎలాంటి కామెడీతో తెరపైకొస్తారో చూద్దామని చాలామంది వెయిటింగ్. లాస్ట్ టైమ్ బోటు అడ్డొచ్చిందని కామెడీ చేసిన లోకేష్.. ఈసారి బ్యారేజీ గేట్లకు చిన్న తెప్ప అడ్డొచ్చిన రెచ్చిపోవానికి ట్విట్టర్ పట్టుకొని రెడీగా ఉన్నారు.

జనాలకు కూడా ఈమధ్య చినబాబు నుంచి కాస్త కామెడీ తగ్గింది. సో.. వీలైనంత త్వరగా లోకేష్ కరకట్ట రాజకీయం స్టార్ట్ చేస్తే నవ్వుకోవడానికి అంతా రెడీ ఇక్కడ.

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

Show comments