ప్ర‌ఖ్యాత న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌పై చార్జిషీట్‌

ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో సుప్రీంకోర్టు ప్ర‌ఖ్యాత న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌తో పాటు సీపీఎం పొలిట్‌బ్యూరో స‌భ్యురాలు బృందాకార‌త్‌, కాంగ్రెస్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్, సీపీఐఎంఎల్‌ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్‌, విద్యార్థి నేత కవల్‌ప్రీత్‌ కౌర్‌, శాస్త్రవేత్త గౌహర్‌ రాజా త‌దిత‌రుల పేర్ల‌ను ఢిల్లీ పోలీసులు చార్జిషీట్‌లో చేర్చారు.  

సీఏఏ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల్లో భాగంగా ఢిల్లీలో హింస చెల‌రేగి ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఈ కేసులో ఇప్ప‌టికే సీపీఎం అగ్ర‌నేత సీతారాం ఏచూరి , జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయ‌కుడి పేర్ల‌ను చార్జిషీట్‌లో చేర్చిన విష‌యం తెలిసిందే.

ఈ చార్జిషీట్ కొన‌సాగింపులో భాగంగా మ‌రికొంద‌రి ప్ర‌ముఖుల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా బృందాకార‌త్ మీడియా మాట్లాడుతూ  త‌మ‌పై దాఖ‌లు చేసింది. 'చార్జీషీట్‌ కాదని, చీట్‌ షీటని ' ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పౌరతస్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వీరు చేసిన ప్రసంగాలే ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యాయంటూ బృందాకరత్‌తో పాటు పలువురిపై పోలీసులు చార్జీషీట్‌ దాఖలు చేయడంపై ఆమె పై విధంగా ఘాటుగా స్పందించారు.

కేంద్ర హోం మంత్రి కనుసన్నల్లోని ఢిల్లీ పోలీసుల ద్వారా భారత ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని ఆమె మండిప డ్డారు.  మత ఘర్షణలకు కారణమైన కపిల్‌ శర్మ వంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని అదే చార్జిషీట్‌లో సామాజిక కార్యకర్తలుగా పేర్కొంటున్నారని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్య‌మించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీక‌రించి, వారిపై చర్యలు తీసుకుంటున్నారని విమ‌ర్శించారు. 

పవన్, బాబు ఒకరికి ఒకరు

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments