రకుల్ పీకల మీదకు తెచ్చిన స్నేహం?

సహవాస దోషం అంటారు పెద్దలు. సరైన వారితో కలిసి తిరిగితే సమస్య కాదు కానీ తేడా జనాలతో తిరిగితేనే సమస్య. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నార్కొటిక్ డిపార్ట్ మెంట్ ఇన్వెస్టిగేషన్ ను ఎదుర్కోవాల్సి  వచ్చింది. డ్రగ్స్ విషయంలో రకుల్ ఈ పరిస్థితికి రావడానికి కారణం రియా(రేహా) చక్రవర్తితో స్నేహమే అని తెలుస్తోంది.

ముంబాయి వెళ్తే చాలు రకుల్ ఎక్కువగా రేహాతో చెట్టపట్టాలు వేసుకునే వుండేదట. వారిద్దరి మధ్య అంత స్నేహం, సాన్నిహిత్యం వుండేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఆమె ద్వారా పలువురు పరిచయం, చాటింగ్ లు, పార్టీలు వగైరాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి.

ఇప్పుడు అలాంటివే రకుల్ ను కార్నర్ లోకి తోసాయి. సరే, ఇప్పుడు ఏమీ అయిపోలేదు. అయిపోతుంది అని అనుకోవడానికీ లేదు. కానీ ఈలోగా మీడియాలో బోలెడంత హడావుడి. సినిమాల ప్లానింగ్ అటుఇటు కావడం, టెన్షన్. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు వివాదాలకు, వార్తలకు దూరంగా వుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం రేహాతో స్నేహం పుణ్యమా అని ఆ లోటు తీరిపోయింది.

పవన్, బాబు ఒకరికి ఒకరు 

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments