డిప్యూటీ సీఎం ఆరోగ్య‌ ప‌రిస్థితి విష‌మం

క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడెవ‌రి ప్రాణాలు తీస్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టేందుకు ఎలాంటి మందులు లేక‌పోవ‌డంతో ...అది చెల‌రేగిపోతోంది. చిన్నాపెద్దా, పేద ధ‌నిక అనే తేడా లేకుండా ఉసురు తీస్తోంది. క‌రోనా బారిన ప‌డిన  ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా మృత్యువుతో పోరాడుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ నెల 14న సిసోడియాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నాయ‌క్ ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఒక‌వైపు క‌రోనాకు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ కోలుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే , మ‌రోవైపు డెంగ్యూ కూడా అటాక్ అయింది.

దీంతో ఆయన ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మించిన‌ట్టు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ర‌క్త క‌ణాల సంఖ్య త‌గ్గ‌డంతో పాటు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయాయ‌ని, ప్ర‌స్తుతం సిసోడియా ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు.

దీంతో ఆయ‌న్ను ఎలాగైనా కాపాడుకోవాల‌నే త‌లంపుతో మెరుగైన వైద్యం  కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని వైద్యులు చెప్పారు. కాగా త‌మ ప్రియ‌త‌మ నేత ఆరోగ్యం విష‌మించిన వార్త తెలుసుకున్న ఆప్ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుందాం. 

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments