మీరు మీరు పచ్చగా ఉంటే మాకు కుదరదు

దేశ ప్రధాని మోడీ.. ఏపీ సీఎం జగన్ ని ప్రశంసలతో ముంచెత్తిన మరుసటి రోజే.. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ ప్రభుత్వంపై విషం కక్కారు. బీజేపీ-వైసీపీకి మధ్య సంబంధాలు ఎక్కడ బలపడిపోతాయోననే ఆందోళన వారిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే లాజిక్ మిస్సై మాట్లాడిన టీడీపీ ఎంపీలు.. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

జీఎస్టీ బకాయిల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆందోళన చేస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు ఎందుకు ఆందోళన చేయలేదన్నది వారి ప్రశ్న. పోనీ వైసీపీ నేతలు చేయలేదు సరే, టీడీపీ ఎంపీలు ఆ పాయింట్ ఎందుకు లేవనెత్తలేదు? సభలో మాట్లాడామని చెప్పుకుంటున్నారు కానీ, కనీసం బైట కేంద్రంపై విమర్శలు ఎందుకు చేయలేదు? మీరేమో కేంద్రంతో దోస్తీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శతృత్వం పెంచుకోవాలి. ఇదెక్కడి చెత్త లాజిక్.

ఇక ఏపీలో ప్రభుత్వం రైతులను నష్టాలపాలు చేస్తోంది, విద్యుత్ మీటర్లతో ఇబ్బంది పెడుతోందని సెలవిచ్చారు కనకమేడల. నిజంగానే ఇది సమస్య అనుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను టీడీపీ ఎందుకు అడ్డుకోలేదు. సభలో బిల్లులకి మద్దతిచ్చి, బైటకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం. సాక్షాత్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఆ విషయం కనకమేడలకు కనపడలేదా? వినపడలేదా? లేదా కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము టీడీపీకి లేదా?

ఇక సీఎం జగన్ ఢిల్లీకి వచ్చి రహస్య మంతనాలు సాగించారనేది టీడీపీ ఎంపీల ప్రధాన ఆరోపణ. అలాంటప్పుడు ఆ రహస్య మంతనాల్లో పాల్గొన్న బీజేపీ నేతల్ని, మంత్రుల్ని కూడా టీడీపీ నిందించాలి కదా? కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు టీడీపీ ఎంపీలు.

పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి భూ కుంభకోణం, ఫైబర్  గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. హస్తినలో చంద్రబాబు పరువు తీసేశారు. దీంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. అందులోనూ జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతం కావడం, ప్రధాని మోదీ సైతం జగన్ పాలనకు మంచి మార్కులు వేయడంతో టీడీపీ నేతలకు కడుపు మంట మరింత పెరిగింది. దాన్ని చల్లార్చుకోడానికే ప్రెస్ మీట్ పెట్టి నిందలు వేశారు. 

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments