కోవాక్సీన్ ను పక్కన పెడతారా?

భారత్ బయోటెక్ నుంచి ఒకటి రెండు నెలల కితం కోవాక్సీన్ పేరిట కరోనా వ్యాక్సీన్ అభివృద్ది హడావుడి వినిపించింది. చకచకా అనుమతులు, తెలుగు మీడియాలో ఒకటే హడావుడి, త్వరలో వ్యాక్సీన్ వచ్చేస్తుందన్న వార్తలు. కానీ అంతలోనే సైలంట్ అయిపోయింది. రష్యా, అమెరికా వ్యాక్సీన్లు, సీరం లాబోరెటరీ, రెడ్డీస్ లాబొరెటరీ ఒప్పందాలు ఇవన్నీ వార్తల్లోకి వచ్చాయి 

కానీ భారత్ బయోటిక్ వార్తలు వినిపించడం,కనిపించడం మానేసాయి. మరో పక్క కరోనా కల్లోలం చల్లబడడం ప్రారంభించింది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సీన్ వార్తలుపై జనాల ఆసక్తి కూడా చల్లబడడం ప్రారంభమైంది. దీంతో కోవాక్సీన్ విషయంలో భారత్ బయోటిక్ వెనక్కు తగ్గిందా అన్న అనుమానాలు వినిపించడం ప్రారంభమైంది.

ఇలాంటి నేపథ్యంలో భారత్ బయోటెక్ కోవాక్సీన్ కన్నా ముందుగా నోసల్ స్ప్రే వ్యాక్సీన్ కు హక్కులు సంపాదించి, ఉత్పత్తి చేయడానికి రంగం సిద్దం చేసుకుంటోదన్న వార్తలు బయటకు వచ్చాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో అభివృద్ది చేసిన నోసల్ స్ప్రే వ్యాక్సీన్ ను అమెరికా, యూరప్, జపాన్ మినహా మిగిలిన దేశాల్లో మార్కెటింగ్ చేసుకునేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదర్చుకుంది. దీనిపై ఇప్పుడు ఇండియాలో క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించాల్సి వుంది.

అంటే రెండు రకాల వ్యాక్సీన్ లను అభివృద్ది చేస్తారా? లేక కోవాక్సీన్ కన్నా ముందుగా ఈ నోసల్ వ్యాక్సీన్ ను తీసుకువస్తారా? అన్నది తెలియాల్సి వుంది. రెగ్యులర్ వ్యాక్సీన్ కన్నా ఈ నోసల్ స్ప్రే వ్యాక్సీన్ అన్ని విధాలా బెటర్ అని అప్పుడే భారత్ బయోటెక్ తరపున వార్తలు వినిపించడం ప్రారంభమైంది. అంటే దీనిని బట్టి చూస్తుంటే కోవాక్సీన్ కన్నా ఈ నోసల్ స్ప్రే కే ప్రాధాన్యత ఇచ్చేలా కనిపిస్తోంది.

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

Show comments