ఇంద్రగంటి భారీ సినిమా క్యాన్సిల్?

వి సినిమా ఫలితం దర్శకుడు ఇంద్రగంటి భారీ సినిమా కోరికను తీరకుండా చేసింది. వి సినిమా చేస్తున్నపుడే దాదాపు 60 నుంచి 70 కోట్ల భారీ సినిమాకు సరిపడే కథను ఇంద్రగంటి రెడీ చేసారు. మైత్రీ మూవీస్ కు ఈ సినిమాను చేయాలని ప్లాన్. కథ వాళ్లకు అద్భుతంగా నచ్చింది. కానీ ఆ కథకు అనుకున్న హీరోతో అంత రేంజ్ లో చేసే పరిస్థితిలో లేమని వారు ఆ ప్రాజెక్టును వదలుకున్నారు. అది అలా దిల్ రాజు దగ్గరకు చేరింది.

దానికి దిల్ రాజు రెడీ అన్నారు. వి తరువాత వెంటనే కాకపోయినా ఆ హీరో కు కుదిరినపుడు చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వి ఫలితం చూసాక ఆ ప్రాజెక్టును డ్రాప్ చేసినట్లు బోగట్టా. ఈ విషయాన్ని దిల్ రాజునే నేరుగా ఇంద్రగంటికి చెప్పి, మరో కథ ఏమన్నా మంచిది, ఆయన స్టయిల్ లో చేయమని కోరినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ లు, భారీలు కన్నా, ఇంద్రగంటికి పేరు తెచ్చి క్లాసిక్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లోనే సినిమా చేద్దామని దిల్ రాజు కోరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఇంద్రగంటి హీరో నాగ్ చైతన్య మాట కోసం చూస్తున్నారు. విక్రమ్ కె కుమార్ సినిమా తరువాత డేట్ లు ఇస్తారేమో అని అనుకుంటున్నారు. అది ఏ సంగతి తేలిపోతే, అప్పుడు ఇంద్రగంటి 'వి' తరువాత ఏంటీ అన్నది ఫిక్స్ అవుతుంది.

జగన్ గారి గురించి భయంగా ఉంది

Show comments