ఆహ్వానించువారు చీటీల చిట్టి

ఈ మధ్య సినిమాలకు వెరైటీ టెటిళ్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడో డైరక్టర్ వంశీ ఔను వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు అంటూ టైటిల్ పెడితే భలే అనుకున్నారు. ఆ తరువాత ఇలాంటి టైటిళ్లు అలవాటు అయిపోయాయి. అయిపోతున్నాయి. అత్తారింటికి దారేది, అరవింత సమేత, అల వైకుంఠపురములో, సర్కారువారి పాట ఇలా సాగుతోంది ఈ టైటిళ్ల కహానీ.

లేటెస్ట్ గా ఇలాంటి వెరైటీ టైటిల్ ఒకటి వినిపిస్తోంది. 'ఆహ్వానించు వారు, చీటీల చిట్టి' ఇదీ టైటిల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్. ఈ టైటిల్ ఎవరికో కాదు, ప్రతి రోజూ పండగే అని చెప్పి, మళ్లీ సోలో బతుకే సొ బెటరూ అంటున్న సాయి ధరమ్ తేజ్ కు. సాయి ధరమ్ తేజ్ మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిల్లో ఇది ఒకటి. జయంత్ అనే కొత్త డైరక్టర్ అందిస్తున్న కథకు ఇదీ టైటిల్ అని తెలుస్తోంది.

దిల్ రాజు, భోగవిల్లి ప్రసాద్ కలిపి ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది లేదా దిల్ రాజు సొలోగా నిర్మించే అవకాశం కూడా వుంది. అయితే ఇది ఇప్పుడే కాదు, దేవా కట్టా డైరక్షన్ లో, ఆ తరువాత సుకుమార్ అసిస్టెంట్ సినిమాలు పూర్తయ్యాక. అప్పుడు తెలుస్తుంది. ఈ చీటీల చిట్టి ఎవరో..ఆ ఆహ్వానం ఏమిటో?

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు

Show comments