తమన్నా..ఆ కాళరాత్రి

లాక్ డౌన్ పుణ్యమా అని ఓటిటి ప్లాట్ ఫారమ్ లు జనాలకు బాగా దగ్గరయ్యాయి. అక్కడా కంటెంట్ వుంటుందని తెలిసి వచ్చింది. ఓటిటి లు కూడా సినిమాల్లో సరైన కంటెంట్ ఎక్కడ వుంటుందా అని వెదకడం ప్రారంభించాయి. దీంతో సినిమాలు సెట్ కాక, కాస్త టైమ్ గ్యాప్ దొరికిన వారంతా ఓటిటికి కంటెంట్ రూపొందించే పనిలో పడ్డారు.

అలా ప్లాన్ చేస్తున్న సినిమానే తమన్నా కీలకపాత్రలో 'ఆ కాళరాత్రి'. వాస్తవానికి ఇది రీమేక్. కన్నడంలో రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. అక్కడ మంచి సమీక్షలు, అవార్డులు లభించాయి ఈ సస్సెన్స్ థ్రిల్లర్ కు. ఇప్పుడు ఈ సినిమాను వెబ్ ఫిల్మ్ గా రూపొందించే పని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆహా ఓటిటి కోసం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ ప్రాజెక్టును టేకప్ చేసినట్లు బోగట్టా. ఈ ప్రాజెక్టును మొదట 14రీల్స్ ప్లస్ కోసం చేస్తారు అని వార్తలు వినవచ్చాయి. కానీ 14రీల్స్ ప్లస్ ఈ ప్రాజెక్టు చేయడం లేదు. మరి ఎవరి కోసం చేస్తారో తెలియాల్సి వుంది. ఆహా ఓటిటి మాత్రం ఈ ప్రాజెక్టును ఫైనల్ చేసింది. అందువల్ల కొంత ఫండింగ్ కూడా వుండొచ్చు. పైగా లిమిటెడ్ పాత్రలతో, ఓ పల్లెటూరు నేపథ్యంలో నడిచే కథ కనుక మరీ ఎక్కువ బడ్జెట్ అవసరం పడకపోవచ్చు. 

ఈ కన్నడ సినిమా గురించి మరింత తెలియాలంటే హాట్ స్టార్ లో కన్నడ వెర్షన్ వుండనే వుంది. చూసుకోవచ్చు.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

Show comments