ఆ సినిమా తమన్నాకు గిట్టుబాటే

మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకుని దాదాపు టాలీవుడ్ హీరోలు అందరితోనూ నటించింది తమన్నా. చాలా మంది యంగ్ హీరోయిన్లకు దక్కని అదృష్టం ఇటు మెగాస్టార్ తోనూ, అటు పవర్ స్టార్ తోనూ మాత్రమే కాకుండా మెగా హీరోలు చాలా మందిని కవర్ చేసేసింది. అందువల్ల ఇక దాదాపు హీరోయిన్ గా రిటైర్ మెంట్ కు దగ్గరకు వచ్చేసింది. 

ఇలాంటి టైమ్ లో వెబ్ ఫిల్మ్ లలోకి కూడా దిగిపోయింది. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వెబ్ ఫిల్మ్ చేస్తోంది. కానీ ఇదే టైమ్ లో కొటిన్నర ఆఫర్ రావడం అంటే మాటలా? నితిన్ హీరో గా రీమేక్ చేస్తున్న అంథాదూన్ లో టబు క్యారెక్టర్ కోసం తమన్నాను ఫైనల్ చేసారు. ఈ క్యారెక్టర్ కోసం చాలా మందిని వెదికారు. ఎవ్వరూ సెట్ కాలేదు. పైగా నెగిటివ్ క్యారెక్టర్. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. 

ఇలాంటి క్యారెక్టర్ ను తమన్నా ఓకే చేసింది. అందుకు ఆమె డిమాండ్ చేసిన మేరకు అటు ఇటు బేరాలు ఆడి ఆఖరికి కోటిన్నరకు పారితోషికం సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుంది. ఈ సినిమాను టాగూర్ మధు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తారు.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు

Show comments